Homeసినిమా వార్తలుBollywood: బాలీవుడ్ లో కూడా ఊపందుకున్న ఫేక్ కలెక్షన్స్

Bollywood: బాలీవుడ్ లో కూడా ఊపందుకున్న ఫేక్ కలెక్షన్స్

- Advertisement -

గత కొన్నేళ్లుగా బాలీవుడ్ పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. షారుఖ్ ఖాన్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ పఠాన్ మినహా మరే సినిమాబ్లోడా ఈ ఏడాది ట్రేడ్ సర్కిల్స్ ను సంతృప్తి పరచలేకపోయింది. గత కొన్నేళ్లుగా భూల్ భులైయా 2, దృశ్యం 2, కాశ్మీర్ ఫైల్స్ వంటి అరుదైన విజయాలను మాత్రమే హిందీ పరిశ్రమ చూసింది. అయితే అవి వరుస ఫ్లాపుల నుండి కాస్త ఊపిరి పీల్చుకునేలా చేసిన అతి కొద్ది సూపర్ సక్సెస్ ఫుల్ సినిమాల సమూహం మాత్రమే.

ఇక అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా, అక్షయ్ కుమార్ సెల్ఫీ, రక్షాబంధన్, సామ్రాట్ పృథ్వీరాజ్ వంటి స్టార్ సినిమాలు భారీ డిజాస్టర్లుగా నిలిచాయి. రణ్ వీర్ సింగ్ నటించిన సర్కస్, రణ్ బీర్ కపూర్ నటించిన షంషేరా సినిమాలు గత ఏడాది అట్టర్ ఫ్లాప్లు గా నిలిచాయి. రణ్ బీర్ కపూర్ బ్రహ్మాస్త్ర ద్వారా హిట్ ఇచ్చినా ఆ సినిమా ఆశించినంత భారీ విజయం సాధించలేదు.

బాలీవుడ్ తో పోలిస్తే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలు మంచి రేటుతో హిట్స్ కొడుతున్నాయి. ఈ పరిశ్రమలన్నీ పాన్ ఇండియా మూవీ ట్రెండ్ కు ఎంతగానో దోహదపడ్డాయి. ఉత్తరాదిన కూడా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, పుష్ప, కాంతార సినిమాలు అద్భుతంగా రాణించాయి.

READ  Allu Arjun - NTR : చర్చల్లో ఉన్న ఎన్టీఆర్ - అల్లు అర్జున్ మల్టీస్టారర్

ఈ విషయంలో బాలీవుడ్ వెనకబడిపోవడంతో ఫేక్ కలెక్షన్లను రిపోర్ట్ చేసే పద్ధతిని వారు కూడా పాటిస్తున్నట్లు కొందరు సినీ ఔత్సాహికులు మరియు ట్రేడ్ వర్గాల వారు ఆరోపిస్తున్నారు. నిజానికి బాలీవుడ్ ట్రాకింగ్ చాలా పారదర్శకంగా ఉంటుంది కాబట్టి బాలీవుడ్ కలెక్షన్లు సాధారణంగా చాలా ప్రామాణికంగా ఉంటాయని చెబుతారు. అయితే ఇప్పుడు వారు కూడా అంకెలను హైప్ చేయడం మొదలుపెట్టినట్లు కొందరు సోషల్ మీడియాలో వాదిస్తున్నారు.

పఠాన్ విషయానికొస్తే బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టే విధంగా కలెక్షన్లు వాస్తవంగా వచ్చిన దాని కంటే ఎక్కువగా ఉన్నాయని విస్తృతంగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్, కిసీ కీ జాన్ సినిమాల విషయంలోనూ అదే జరుగుతోంది అని అంటున్నారు. ప్రేక్షకులతో పాటు రివ్యూయర్ల నుంచి కూడా విమర్శలు అందుకున్న ఈ సినిమాని చూడటానికి ఈద్ హాలిడే తర్వాత ప్రేక్షకులు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయినప్పటికీ కలెక్షన్లు మాత్రం బ్లాక్ బస్టర్ స్థాయిలోనే కనిపిస్తున్నాయని.. అందుకే ఇవి ఫేక్ కలెక్షన్లు అని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

READ  Salman Khan: కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తన సూపర్ స్టార్ డమ్ ను నిరూపించుకున్న సల్మాన్ ఖాన్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories