Homeసినిమా వార్తలుటీఆర్పీ రేటింగ్లలో నిరాశ పరిచిన F3

టీఆర్పీ రేటింగ్లలో నిరాశ పరిచిన F3

- Advertisement -

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు హీరోలుగా, తమన్నా భాటియా, మెహ్రిన్ కౌర్ లు హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ ఫన్ ఎంటర్ టైనర్ ఎఫ్3. ఈ చిత్రం థియేటర్లలో విడుదలయి కాస్త నెగటివ్ టాక్ తెచ్చుకున్నా, బాక్స్ ఆఫీస్ వద్ద ఏబొవ్ యావరేజ్ గా నిలిచింది.

వీరి కాంబినేషన్లో ఈ ఫ్రాంచైజీలో వచ్చిన మొదటి చిత్రం ఎఫ్‌2 ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించి ఆ సీజన్ లో బిగ్గెస్ట్ హిట్ అవడంతో పాటు ఆ సంవత్సరంలో కూడా భారీ విజయం సాధించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది.

కానీ ఎఫ్3 సినిమా మాత్రం ప్రేక్షకులను అదే స్థాయిలో ఆకట్టుకోవడంలో విఫలం అయింది. కేవలం కొన్ని చోట్ల కామెడీ సన్నివేశాలు తప్ప సినిమాలో సరైన విషయం లేదని ప్రేక్షకులు పెదవి విరిచారు. అయితే సీక్వెల్ క్రేజ్ మరియు సమ్మర్ రిలీజ్ అవడం వల్ల కలెక్షన్ల విషయంలో మాత్రం పరవాలేదు అనిపించుకుంది.

READ  Box-Office: బ్రహ్మస్త్ర రెండు రోజుల ఇండియా వైడ్ కలెక్షన్లు

ఇక తాజాగా ఫ్3 చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ప్రసారం అయిన సంగతి తెలిసిందే. గత ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం కాగా.. బుల్లితెర పై ఈ చిత్రం ప్రేక్షకులని అలరించ లేకపోయింది. గమ్మత్తైన విషయం ఏమిటంటే, F2 చిత్రం తన మొదటి టెలివిజన్ ప్రీమియర్ lo 17.2 రేటింగ్ ను పొందగా F3 చిత్రం అందులో సగం రేటింగ్ సాధించింది. కాగా అర్బన్ టీఆర్పీ రేటింగ్లో 8.26, అర్బన్ + రూరల్ రేటింగ్లో 6.62 రేటింగ్ వచ్చింది.

సినిమాలకు టీఆర్పీ రేటింగ్లు తక్కువ రావడం ఈ మధ్య ఎక్కువ సినిమాలకు జరుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ప్రేక్షకుడు కేవలం ధియేటర్ లేదా టివిలో సినిమాలను చూసే అవకాశం ఉండేది. కానీ గత కొన్నేళ్లలో వచ్చిన ఓటిటి విప్లవం వల్ల ఇప్పుడు మొబైల్ ఫోన్లలోనే సినిమాలు వీక్షించే అవకాశం ఉండడం వల్ల టివిలో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించడం లేదు.

READ  టాలీవుడ్ రీ-రిలీజ్ ల పరంపరలో బాలయ్య సమరసింహారెడ్డి

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories