Homeసినిమా వార్తలులైగర్ సినిమా సెన్సార్ టాక్

లైగర్ సినిమా సెన్సార్ టాక్

- Advertisement -

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరియు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న తాజా సినిమా లైగర్ . ఈ సినిమాలో విజయ్ దేవరకొండ జంటగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తున్నారు. కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు.

షూటింగ్ చేస్తూనే ఈ సినిమా నుంచి వదులుతున్న ఒక్కో ప్రచార కార్యక్రమం సినిమా పై హైప్ ను పెంచుతుంది.విజయ్ దేవరకొండ- పూరి జగన్ తొలిసారి కలిసి పని చేస్తున్న సినిమా కావడంతో ప్రతి ఒక్కరి చూపు ఈ సినిమా పైనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఆఫత్ అనే ప్రోమో సాంగ్ ను విడుదల చేయగా.. అది ప్రేక్షకులని ఆకట్టుకుంది.

https://youtu.be/9jbRCSZHodM

ఈ పాటలో విజయ్ దేవరకొండ మరియు అనన్య పాండేల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. రొమాన్స్ లో పూరి స్టైల్ ప్రత్యేకం. ఆ శైలికి తగ్గట్టే ఈ పాట చిత్రీకరించి ఆకట్టుకున్నారు.

READ  సీతారామం ట్రైలర్ రివ్యూ

ఈ సినిమాపై బోలెడన్ని అంచనాలు ప్రేక్షకుల్లో ఏర్పడ్డాయి. స్టైలిష్ లుక్ లో విజయ్‌ని చూసి ఫిదా అవుతున్నారు ఆయన అభిమానులు. ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎంతో భారీ ఎత్తున ఆగస్టు 25న ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. లైగర్ ను హిందీలో బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి కావడం విశేషం.

ఇక ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది లైగర్ సినిమా. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు పూరి మరియు విజయ్ ను పొగడ్తలతో ముంచెత్తారు అని సమాచారం. పూరి మార్క్ హీరో క్యారెక్టరజేషన్ లో విజయ్ అద్భుతంగా సరిపోయారని.. ఊహించని రీతిలో ఫైట్లు మరియు డాన్స్ చేసి విజయ్ ఆశ్చర్య పరిచారు అని సెన్సార్ సభ్యులు చెప్పినట్లు తెలుస్తోంది.

ఇక సినిమా నిడివి విషయానికి వస్తే 2:20 గంటల సమయాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది. అందులో మొదటి 1:15 నిమిషాలు ఐతే 1:05 నిమిషాలుగా విభజించారు. సినిమాలో విజయ్ అద్భుతమైన దేహ దారుఢ్యం, నటనతో పాటు తల్లి పాత్రలో రమ్యకృష్ణతో ఉన్న సెంటిమెంట్ సన్నివేశాలు బాగా వచ్చాయని, అలాగే అనన్య పాండే ల మధ్య రొమాన్స్ ట్రాక్ కూడా చాలా బాగుందని సెన్సార్ సభ్యులు మెచ్చుకున్నారు అని సమాచారం. సాంకేతికంగా ఎంతో అత్యున్నతంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రఖ్యాత ప్రపంచ బాక్సర్ మైక్ టైసన్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండడం మరో విశేషం.

Follow on Google News Follow on Whatsapp

READ  బుల్లితెర పై RRR Vs KGF 2


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories