2024 సంక్రాంతి సీజన్ స్టార్ హీరోల సినిమాలతో నిండిపోతుంది. రామ్ చరణ్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ ఇలా టాప్ తెలుగు స్టార్స్ అందరూ తమ సినిమాలను ఆ పండగ సీజన్ కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.అయితే ఈ లిస్ట్ లో ఒక్క హీరో మాత్రం మిస్ అయ్యారు. ఆ హీరో నే ఎన్టీఆర్.
రామ్ చరణ్, శంకర్ కాంబోలో రూపొందుతున్న RC 15 సినిమా సంక్రాంతికి విడుదల కానుందని ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక మొదట ఆగస్టులో విడుదల చేయాలని భావించిన మహేష్ త్రివిక్రమ్ సినిమా (SSMBB28) ఇప్పుడు ఆగస్టులో విడుదల చేయడం సాధ్యంకాదని తేలిపోవడంతో చిత్ర యూనిట్ మరో తేదీని పరిశీలిస్తున్నట్లు గానూ, ఇప్పుడు ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతికి విడుదల చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ప్రభాస్ – మారుతిల కాంబినేషన్లో తెరకెక్కనున్న ఎంటర్టైనర్ ను అందించడానికి కూడా సంక్రాంతి బెస్ట్ పీరియడ్ అని ఆ చిత్ర బృందం భావిస్తోందట. పాన్ ఇండియా మూవీ పుష్ప 2 యూనిట్ కి కూడా సంక్రాంతి డేట్ రిలీజ్ డేట్ ఆప్షన్స్ లో ఒకటిగా ఉంది. పవన్ కళ్యాణ్ – సుజీత్ సినిమా కూడా సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశం ఉంది.
ఈ సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సమ్మర్ లో ఒక సినిమా స్టార్ట్ చేసి ఆ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఒక్క సినిమా మాత్రమే విడుదల కావడం ఖాయమని, అయితే ఆ సినిమా ఏదనేది ప్రస్తుతానికి స్పష్టత లేదని అంటున్నారు.
ఓవరాల్ గా ఎన్టీఆర్ మినహా మిగతా స్టార్స్ అందరూ 2024 సంక్రాంతికి సినిమాలను రిలీజ్. చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు బాక్సాఫీస్ యొక్క బిగ్గెస్ట్ సీజన్ అయిన వచ్చే సంక్రాంతికి ఏ సినిమా విడుదలవుతుందా అని స్టార్ హీరోల అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.