కొన్నేళ్లుగా, హీరో దుల్కర్ సల్మాన్ ఎదుగుదల ప్రశంసనీయం. కేవలం తన సొంత పరిశ్రమ అయినా మలయాళంలో మాత్రమే కాకుండా.. వివిధ భాషలలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. కేరళలో సూపర్‌స్టార్‌గా మారిన తర్వాత, ఆయన ప్రస్తుతం ఈ ప్యాన్-ఇండియన్ సూపర్‌స్టార్‌గా మారే దిశగా అడుగులు వేస్తున్నారు.
మహానటి సినిమాలో జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. పరభాషా నటుడు అయినప్పటికీ, తెలుగు భాష పై ఆయనకున్న పట్టు అభినందనీయం. అలాగే ఆయన అనేక తమిళ చిత్రాలలో కూడా నటించారు, అందువల్ల తమిళనాడులో కూడా దుల్కర్ సల్మాన్ కు అభిమానులు వచ్చారు. కన్నుమ్ కన్నుమ్ కొల్లైయాడితాల్, ఓకే కన్మణి వంటి సినిమాలు ఆయనను తమిళ ప్రేక్షకుల్లో స్టార్‌గా మార్చాయి.
2021లో, తాజాగా ఆయన నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా కురుప్‌తో ప్యాన్-ఇండియాకు విజయం సాధించి ప్యాన్-ఇండియన్ స్టార్‌గా ఎదగడానికి తొలి మెట్టు ఎక్కారు. ఇక తాజాగా సీతా రామం చిత్రం తర్వాత దుల్కర్ దారి మరింత సులువైంది. సీతా రామం చిత్రం అన్ని వెర్షన్లు కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా విజయం సాధించాయి. తాజాగా విడుదలైన హిందీ వెర్షన్ చూసిన అక్కడి ప్రేక్షకులు కూడా దుల్కర్‌ను ఆదరిస్తున్నారు. ఆయన ఇదివరకే కారవాన్, ది జోయా ఫ్యాక్టర్ వంటి స్ట్రెయిట్ హిందీ సినిమాల్లో నటించారు.
సీతారామం అద్భుతమైన విజయం తరువాత, చాలా మంది దర్శకనిర్మాతలు దుల్కర్‌ను దృష్టిలో ఉంచుకుని ప్యాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌లను చేయాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం దుల్కర్‌కి పెరుగుతున్న డిమాండ్‌ను చూస్తుంటే, ఆయన వేగంగా ఎదుగుతున్న ప్యాన్-ఇండియన్ సూపర్‌స్టార్‌గా కనిపిస్తున్నారు. దుల్కర్ నటించిన తాజా బాలీవుడ్ చిత్రం “చుప్” కూడా ప్యాన్ ఇండియా తరహాలో అన్ని భాషల్లో విడుదల కానుంది.
ఇక సీతారామం సినిమా విడుదలకు ముందు పెద్దగా హడావిడి చేయకపోయినా.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సినిమాలో సరైన విషయం ఉంటే ఎప్పుడూ ప్రేక్షకులు ఆ చిత్రాన్ని ఆదరిస్తారు అనే విషయం మరోసారి ఈ సినిమా నిరూపించింది. సినిమాలో ఖచ్చితంగా స్టార్ హీరో ఉన్నాడా లేదా అనేది ప్రేక్షకులు ఎప్పుడు కూడా పట్టించుకోరు. సినిమా ఎంత బాగుందో అనేదే ప్రేక్షకులకి ముఖ్యం.