ప్రస్తుతం కోలీవుడ్ లో యువనటుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యూత్ ఫుల్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ డ్రాగన్. మొన్న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ అయితే సొంతం చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు, తమిళ భాషలతో బాగానే కలెక్షన్ రాబడుతుంది. తెలుగులో ఈ మూవీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ టైటిల్ తో డబ్ కాబడి రిలీజ్ అయింది.
ముఖ్యంగా బిగ్ బడ్జెట్ సినిమాలతో పోలిస్తే మీడియం బడ్జెట్ తో రూపొందిన సినిమా ప్రస్తుతం అటు ఓవర్సీస్ లో కూడా అదరగొడుతూ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు వర్షన్ అక్కడ 4,21,792 డాలర్లు అందుకుంది. అందులో యూఎస్ నుంచి 3,71,751 డాలర్లు అలానే కెనడా నుంచి 50,221 డాలర్లు ఉన్నాయి.
వీటిలో తమిళ వర్షన్ 281,866 డాలర్లు, తెలుగు వర్షన్ 139,926 కలెక్షన్ రాబట్టింది. మొత్తంగా దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా 1 మిలియన్ డాలర్లు అందుకోవటం పెద్ద కష్టమే కాదనిపిస్తోంది. నటుడిగా ఈ సినిమాతో మరింత రేంజ్కి దూసుకెళ్లారు హీరో ప్రదీప్ రంగనాథ ప్రస్తుతం యుఎస్ లో ఈ సినిమా తెలుగు వర్షన్ రన్ ని బట్టి చూస్తే ఓవరాల్ గా 4,00,000 డాలర్లను అందుకునే అవకాశం అయితే కనబడుతుంది.
అలానే ఓవరాల్ వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా కూడా ఇది రూ. 100 కోట్లను దాటేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో ప్రదీప్ రంగనాథన్ అద్భుత యాక్టింగ్ తో పాటు దర్శకుడు అశ్వత్ మారిముత్తు టేకింగ్ కూడా బాగానే పనిచేసింది. అలానే యాక్షన్ ఎమోషనల్ లవ్ సీన్స్ కామెడీ వంటి అంశాలు కూడా బాగా పనిచేశాయి. మరి ఓవరాల్ గా డ్రాగన్ ఎంత మేర రాబడుతుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలి.