డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూ స్వయంగా రామ్ పోతినేని హీరోగా నిర్మించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ డబుల్ ఇస్మార్ట్. ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా మణిశర్మ సంగీతం అందించారు. బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ విలన్ గా కనిపించిన ఈ మూవీ పై మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.
ఇక నిన్న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చిన డబుల్ ఇస్మార్ట్ మూవీ ఊహించని విధంగా నెగటివ్ టాక్ అందుకుంది. అయితే ఓవరాల్ గా రామ్ యాక్టింగ్, అక్కడక్కడా కొన్ని యాక్షన్ సీన్స్ తప్ప మూవీలో పెద్దగా మ్యాటర్ ఏమి లేదు. విషయం ఏమిటంటే, ఈ మూవీలో బోకా క్యారెక్టర్‌లో కమెడియన్ ఆలీ నటించారు.
నిజానికి మూవీలో ఇది చాలా చిరాకు కలిగించే కామెడీ ట్రాక్ ఇది. ఆలీ వచ్చినప్పుడల్లా ప్రేక్షకులు చాలా చిరాకుగా ఫీలవుతున్నారు. రెండు సీన్స్ బాగున్నాయి అనుకునేలోపు ఆలీ ట్రాక్ మధ్యలో వచ్చి దానిని డ్యామేజ్ చేస్తుంది. కాగా ఆలీ ట్రాక్ లేకపోతే కొంచెం బెటర్ టాక్ వచ్చేది డబుల్ ఇస్మార్ట్ కి. మొత్తంగా ఆలీ బొకగా సినిమాలో చేసాడు కానీ సినిమాకి ఆ క్యారెక్టర్ పెద్ద బొక్క అని చెప్పకతప్పదు. ఈ క్యారెక్టర్ ని మూవీలో ఇకపై ట్రిమ్ చేస్తే బెటర్.