Homeసినిమా వార్తలుడీజే టిల్లు సీక్వెల్ కు ఎందుకు పని చేయటం లేదో తెలియజెప్పిన దర్శకుడు

డీజే టిల్లు సీక్వెల్ కు ఎందుకు పని చేయటం లేదో తెలియజెప్పిన దర్శకుడు

- Advertisement -

ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన సినిమాల్లో డీజే టిల్లు ఒకటి. ఇందులో ప్రేక్షకులను అలరించే కామెడీ, ఆసక్తికరమైన కథాంశం, డీజే టిల్లుగా సిద్ధు జొన్నలగడ్డ నటన మరియు యాటిట్యూడ్ అందరినీ మెప్పించాయి. ఈ అంశాలు అన్నీ కలిసి సినిమాని క్లీన్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచేలా చేశాయి.

సినిమాకి లభించిన భారీ ఆదరణ చూసిన డీజే టిల్లు నిర్మాతలు.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రానికి సీక్వెల్‌ను ప్రారంభించారు. ఇటీవలే విడుదలైన టిల్లు స్క్వేర్ టీజర్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చింది.

అయితే డీజే టిల్లు సినిమాకి దర్శకుడైన విమల్ కృష్ణ.. సీక్వెల్ కోసం పనిచేయడం లేదు. మొదట్లో సిద్ధు, దర్శకుడు విమల్‌ల మధ్య విభేదాలు వచ్చి దర్శకుడిని మార్చేశారని వార్తలు వచ్చాయి.

అయితే దర్శకుడు విమల్ కృష్ణ డీజే టిల్లు 2లో తాను లేకపోవడానికి గల కారణాన్ని స్పష్టం చేయడం ద్వారా గాలి వార్తలు అన్నిటినీ క్లియర్ చేసారు. కాగా ఈ యువ దర్శకుడు ఒకసారి పని చేసిన పాత్ర పై మళ్ళీ చేయడానికి ఇష్టపడనని తెలిపారు. అందుకే సీక్వెల్ లో తను బాగం అవలేదని, అయితే సిద్ధూతో తన తదుపరి కలయిక తప్పకుండా కొత్త పాత్ర మరియు ఊహించని కథాంశంగా ఉంటుందని విమల్ చెప్పారు.

అలాగే ప్రస్తుతం తాను ఇతర నటీనటులు మరియు ప్రొడక్షన్ హౌస్‌లతో బిజీగా ఉన్నానని విమల్ చెప్పారు. అందుకే ఈ దర్శకుడు సిద్ధూతో కలిసి పనిచేయడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. డీజే టిల్లు అందించిన వినోదాన్ని విమల్ – సిద్ధుల తదుపరి చిత్రం అధిగమిస్తుందని ఆశిద్దాం.

READ  బాక్సాఫీస్ వద్ద తగ్గని కాంతార జోరు.. 300 కోట్ల వసూళ్లు

ఇక డీజే టిల్లు యొక్క సీక్వెల్‌కు టిల్లు స్క్వేర్ అని టైటిల్ పెట్టారు. ఇటీవలే విడుదలైన టీజర్‌ను ఒరిజినల్‌తో పోల్చినప్పుడు చాలా ఎక్కువ ఆహ్లాదకరమైన మరియు వినోదాన్ని అందించేలా ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. మొదటి భాగం కంటే మించిన పంచ్‌లు, జోకులు మరియు వినోదంతో నిండి ఉండేలా ఉందని అందరూ భావించారు. అనుపమ పరమేశ్వరన్ సీక్వెల్‌లో కథానాయికగా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని మార్చి 2023లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  ఈ వారం సినిమాల ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories