రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఎంతో ఉత్సాహం మరియు ఆత్మ విశ్వాసంతో ప్యాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ ను షేక్ చేసే సక్సెస్ అందుకోవాలి అని లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత అయిన కరణ్ జోహార్ ఈ సినిమా నిర్మాణంలో ఒక భాగం కావడంతో బాలీవుడ్ లో కూడా ఈ చిత్రానికి ఒక అగ్ర హీరోకు దక్కే స్థాయిలో ఈ సినిమాకు భారీ స్థాయిలో ధియేటర్లు లభించాయి.
ఇక ఈ చిత్ర ప్రచార సమయంలో హీరో విజయ్ దేవరకొండ చాలా కష్టపడ్డారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతా తిరిగి విస్తృతంగా ప్రచారం చేశారు. సినిమా ఒక అద్భుతం.. చూడకుంటే ఏదో కోల్పోతారు అన్న తరహాలో ప్రచారం చేయడం వల్ల, విజయ్ కు ఆల్రెడీ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ వల్ల లైగర్ సినిమాకు ఓపెనింగ్స్ అయితే భారీ స్థాయిలో వచ్చాయి.
హిందీలో కూడా విజయ్ దేవరకొండ కొత్త హీరో అయినప్పటికీ.. ఒక రెగ్యులర్ హీరో స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది లైగర్. అయితే తొలి రోజు మార్నింగ్ షో నించే దారుణమైన టాక్ రావడంతో.. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. హిందీ కలెక్షన్స్ మాత్రం శుక్రవారం విడుదల చేయడంతో మూడు రోజుల వరకు బాగానే వచ్చాయి. ఇక హిందీ వెర్షన్ మొత్తంగా నాలుగు రోజులకు కలుపుకుని శుక్రవారం లైగర్ 15 కోట్ల నెట్ రాబట్టింది. ఇక పై ఎక్కడా లైగర్ చిత్రానికి షేర్ వచ్చే సూచనలు అటుంచి. ఈ శుక్రవారానికి అసలు ఏ ధియేటర్ లోనూ కనిపించనంత భారీ స్థాయిలో సినిమా డిజాస్టర్ కావడం అటు ట్రేడ్ వర్గాలను, ఇటు ఇండస్ట్రీ వర్గాలను షాక్ కు గురి చేసింది.
ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 90 కోట్ల బిజినెస్ జరుపుకోగా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల షేర్ రావడం కూడా గగనంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పంపిణీదారులందరికీ చిత్రం భారీ నష్టాలను మిగిల్చింది. కాగా ఈ నష్టాలని భరించేది ఎవరు అన్న విషయం పై అంతర్గత వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
సినిమా విడుదలకు ముందు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, లైగర్ సినిమా మొత్తం ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని.. కలెక్షన్ల పరంగా నా కౌంట్ 200 కోట్ల నుండి ప్రారంభమవుతుందని భారీ స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ సినిమా విడుదలైన తర్వాత 80% నష్టాలతో డిస్ట్రిబ్యూటర్లు మరియు ఎగ్జిబిటర్లు అల్లాడిపోయారు. ఇది ఎవరు కూడా ఊహించని పరిణామం.