ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 డిసెంబర్ 5న ఆడియన్స్ ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్నిటితో అందరినీ ఆకట్టుకుని మూవీ పై అంచనాలను అమాంతంగా పెంచేసింది పుష్ప 2. వై రవిశంకర్, నవీన్ యర్నేని కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థపై గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ సినిమా పై అల్లు అర్జున్ అభిమానుల్లో మరింతగా క్రేజ్ ఉంది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఖాయమని దర్శకుడు సుకుమార్ కూడా ఆశాభావం చేస్తున్నారు.
ఇప్పటికే ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా ఆయన మాట్లాడుతూ టీం మొత్తం మూడేళ్లు ఎంతో కష్టపడ్డామని ముఖ్యంగా ఈ కథని కేవలం అల్లు అర్జున్ కోసమే రాశానని ఆయన డెడికేషన్, పవర్ఫుల్ యాక్టింగ్ ఈ సినిమాకి ఎంతో ప్లస్ అవుతాయన్నారు. బన్నీ ప్రతి ఒక్క సన్నివేశాన్ని ఎంతో బాగా నటించి టీ మొత్తంలో జోష్ నింపారని తప్పకుండా మూవీ బ్లాక్ బస్టర్ కొడుతుందని అన్నారు. మరోవైపు నిర్మాతలు కూడా ఈ మూవీ భారీ సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
మొత్తంగా పుష్ప 2 కి సంబందించి అవుట్ పుట్ పరంగా దర్శకుడు సుకుమార్ అయితే మరింత హ్యాపీగా ఉన్నారట. తప్పకుండా ఈ మూవీతో దర్శకుడిగా తన రేంజ్ మరింతగా పెరగడం ఖాయమని, పలు కీలక సీన్స్, ముఖ్యంగా ఎలివేషన్ సీన్స్ కి, అలానే ఎమోషనల్ సన్నివేశాలకు అందరి నుండి బాగా రెస్పాన్స్ వస్తుందని సుకుమార్ హై కాన్ఫిడెన్స్ తో ఉన్నారట. ఇక రిలీజ్ అనంతరం ఈ మూవీ భారీ సక్సెస్ కొట్టినట్లైతే హీరోగా అల్లు అర్జున్ రేంజ్ తో పాటు మార్కెట్ వాల్యూ కూడా విపరీతంగా పెరుగుతాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి డిసెంబర్ 5న ఆడియన్స్ ముందుకు రానున్న ఈ మూవీ ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి