బాహుబలి సినిమాతో ప్రభాస్ ఎలా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడో, కేజీఎఫ్ సినిమాతో యశ్ కూడా సూపర్ స్టార్ అయిపోయాడు. మరీ ముఖ్యంగా ఇటీవల విడుదలైన కేజీఎఫ్ రెండవ భాగానికి దేశవ్యాప్తంగాఅద్భుతమైన స్పందన వచ్చింది.అసలు కన్నడ సినిమా ఇండస్ట్రీని రెండేళ్ల కిందటి వరకు ఎవరూ పట్టించుకోలేదు. అలాంటి ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరో ఏకంగా మొదటిరోజే 170 కోట్ల వసూళ్లు కొల్లగొట్టడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.హిందీ బాక్స్ ఆఫీస్ వద్దకేజీఎఫ్ చాప్టర్ 2 బద్దలు కొడుతున్న రికార్డులు చూసి ట్రేడ్ పండితులు సైతం అవాక్కయ్యారు అంటే అది అతిశయోక్తి కాదు. హిందీ వెర్షన్ లోబాహుబలి2 తరువాత ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లను నమోదు చేసిన చిత్రంగా కేజీఫ్ 2 నిలిచింది.
ఇంతటి ఘవిజయం సాధించిన యష్ తరువాత చిత్రం స్ట్రెయిట్ తెలుగు సినిమా అని ఇది వరకు ప్రచారం జరిగినా, అధికారికంగా ప్రకటన ఏదీ రాలేదు. రాకీ భాయ్ బాక్సాఫీస్ దగ్గర సృష్టిస్తున్న సంచలనాలు చూసిన తర్వాత ఆయనతో నేరుగా తెలుగు సినిమా చేయాలని నిర్మాతలు ఆశపడటంలో తప్పు లేదు.ఈ క్రమంలోనే ఒకరిద్దరు అగ్ర దర్శకులు యష్ ను కలిసి తమ ఐడియాలను వినిపించినట్లు వార్తలు వచ్చాయి.ఆ మధ్య ఒకసారి పూరి జగన్నాథ్ జనగణమన సినిమా యశ్ తోనే అనే ప్రచారం కూడా గట్టిగా జరిగింది. కానీ అది కుదరలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఆ సినిమా రాబోతుంది.
అయితే ఈ ఊహాగానాల్లో భాగంగా మరో భారీ కాంబినేషన్ తెర పైకి వచ్చింది. సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో యశ్ సినిమా చేయబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. కేజీఫ్2 తరువాత ఈ కాంబో అంటే ఇంక పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ రావడం పక్కా. ఇదే గనక నిజం అయితే యశ్ పాన్ ఇండియా స్టార్ గా సెటిల్ అయిపోవడం ఖాయం.మరి ఈ అరుదైన కలయిక నిజం అవుతుందో లేదో చూద్దాం.