Homeసినిమా వార్తలుRC-15: దిల్ రాజు తీరుతో సంతోషంగా లేని శంకర్

RC-15: దిల్ రాజు తీరుతో సంతోషంగా లేని శంకర్

- Advertisement -

కేవలం తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు యావత్ భారతదేశ సినీ రంగంలోని అగ్ర నిర్మాతలలో దిల్ రాజు ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కెరీర్ తొలినాళ్ళ నుండి ఆయన సినిమాల్లో సక్సెస్ రెట్ ఎక్కువ.. నిరంతరం సూపర్‌హిట్‌లను అందించడంలో ఆయన దిట్ట. ఎందుకంటే కథల ఎంపికలో, జడ్జ్మెంట్లో ఆయనకు ఎంతో నైపుణ్యం ఉండటం వల్లే అది సాధ్యపడింది.

మరియు పని చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ సినిమాలని క్రమశిక్షణతో తెరకెక్కించే వైఖరికి ప్రసిద్ధి చెందారు దిల్ రాజు. ఇక ఆయన చేతిలో ప్రస్తుతం రెండు భారీ ప్యాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. కాగా ఒకే సమయంలో ఆ రెండు భారీ చిత్రాల నిర్మాణ పనులను నిర్వహిస్తున్నారు.

ఆ రెండు సినిమాలు ఏవంటే.. దక్షిణ భారత సినీ పరిశ్రమలో దిగ్గజ దర్శకుడైన శంకర్‌ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా RC15.. అలాగే వంశీ పైడిపల్లితో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న వరిసు (తెలుగులో వారసుడు).

ముందుగా చెప్పుకున్నట్లు.. అగ్ర నిర్మాతల జాబితాలో దిల్ రాజు ఖచ్చితంగా అగ్రస్థానంలో ఉంటారు, కానీ సినిమా నిర్మాణంలో ఆయన చాలే లెక్కలు వేసుకుంటూ ఉంటారు. స్టార్ హీరోలతో సినిమా తీసినా కూడా, అత్యవసరం అయితే తప్ప ఆయన బడ్జెట్ చేయి దాటకుండా పరిమితంగా ఉండేలా చూసుకుంటారు. కానీ దర్శకుడు శంకర్ శైలి అలా కాదు.. ఆయన సినిమా బడ్జెట్ గురించి పెద్దగా ఆలోచించడానికి ఇష్ట పడరు. కేవలం సినిమాలోని కంటెంట్ పైనే దృష్టి పెడతారు.

ఆ రకంగా సినిమాని తెరకెక్కించే ప్రక్రియలో నిర్మాత కంటే శంకర్ దే పై చేయి ఉంటుంది. ఇప్పటి వరకు ఆయనతో సినిమాలు తీసిన నిర్మాతలు అందరూ శంకర్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన వారే. అందుకే బడ్జెట్ విషయంలో ఎలాంటి టెన్షన్ పడకుండా కంటెంట్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా భారీ స్థాయిలో సినిమాలను రూపొందించారు.

READ  దిల్ రాజు కావాలనే కార్తీకేయ-2 ని టార్గెట్ చేస్తున్నారా?

అయితే దిల్ రాజు మాత్రం RC-15 సినిమా షూటింగ్లో రోజుకో లెక్కలు వేస్తూ వస్తున్నారట. దీంతో శంకర్ కలత చెందారని సమాచారం . ప్రతి సన్నివేశంలో దిల్ రాజు నిరంతరం పాల్గొనడం వల్ల శంకర్ అసౌకర్యానికి గురవుతున్నారట. ఇక దిల్ రాజు బృందం కూడా ప్రతి సన్నివేశానికి బడ్జెట్ తగ్గించాలని చూస్తుందట.

ఇంతకుముందు కూడా, బడ్జెట్‌కు సంబంధించి ఇలాంటి లెక్కల కారణంగానే దిల్ రాజు భారతీయుడు 2 ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. సాధారణంగా దిల్ రాజు బడ్జెట్‌ విషయంలో లెక్కలు వేసుకోవడం తప్పు లేదు, అయితే సినిమాలను తెరకెక్కించే విషయంలో ఎంతో గొప్ప విజన్‌ ఉందని పేరుగాంచిన శంకర్ వంటి దర్శకులకు మాత్రం స్వేచ్ఛ ఇవ్వాలి. అలాంటప్పుడే సినిమా సరైన ఫలితం రాబట్టే అవకాశాలు ఉంటాయి.

Follow on Google News Follow on Whatsapp

READ  Television: ఆగస్ట్ 21న జీ తెలుగులో డాన్స్ ఇండియా డాన్స్ భారీ లాంచ్ ఈవెంట్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories