Homeసినిమా వార్తలుKabzaa: కబ్జా సినిమాకు సీక్వెల్ ను ప్రకటించిన దర్శకుడు ఆర్ చంద్రు

Kabzaa: కబ్జా సినిమాకు సీక్వెల్ ను ప్రకటించిన దర్శకుడు ఆర్ చంద్రు

- Advertisement -

పాన్ ఇండియా యాక్షన్ మూవీ కబ్జా సీక్వెల్ ను దర్శకుడు ఆర్.చంద్రు శుక్రవారం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించారు. ఉపేంద్ర, కిచ్చా సుదీప్, మురళి శర్మ, శ్రియ శరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2023 మార్చి 17న థియేటర్లలో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో కబ్జా డిజిటల్ స్ట్రీమింగ్ అరంగేట్రం చేసిన రోజే ఈ ప్రకటన వెలువడింది.

థియేట్రికల్ రిలీజ్ అయిన 25 రోజుల తర్వాత కబ్జా సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా పోస్టర్ ను షేర్ చేసిన ఆర్.చంద్రు ‘బిగ్ అనౌన్స్మెంట్’ అని తన ట్విట్టర్ అకౌంట్ పై రాసుకొచ్చారు.

అయితే ఈ వార్తకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఒక డిజాస్టర్ సినిమాకు సీక్వెల్ రావడం ఏమిటని హాస్యాస్పదంగా ఉందని చాలా మంది నెటిజన్లు గెలి చేశారు. ఏదేమైనా కబ్జా సీక్వెల్ వార్త విని కన్నడ సినీ ప్రియులు ఎంతో ఉత్సాహ పడ్డారు.

READ  Pushpa 2: పుష్ప 2 టీజర్, ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్స్

కబ్జా సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ పెద్ద డిజాస్టర్ గా నిలవడంతో చివర్లో సీక్వెల్ ప్లాన్ ఉందని హింట్ ఇచ్చినా మొదటి భాగం ఫెయిల్యూర్ కావడంతో ఈ సినిమా క్యాన్సిల్ అవుతుందని అందరూ భావించారు. అయితే ఆశ్చర్యకరంగా చిత్ర బృందం ఇప్పుడు సీక్వెల్ ను ప్రకటించడం అందరికీ షాకింగ్ న్యూస్ గా మారింది.

ఆర్.చంద్రు దర్శకత్వం వహించిన కబ్జా చిత్రాన్ని అలంకార్ పాండియన్, ఆనంద్ పండిట్, ఆర్.చంద్రు నిర్మించారు. ఉపేంద్ర, శివ రాజ్ కుమార్, కిచ్చా సుదీప్, శ్రియ శరణ్, దేవ్ గిల్, కబీర్ దుహాన్ సింగ్, సుధ, నవాబ్ షా, కోట శ్రీనివాసరావు, సునీల్ పురాణిక్, మురళీ శర్మ తదితరులు ఈ చిత్రంలో నటించారు.

Follow on Google News Follow on Whatsapp

READ  Nani - Trivikram: నాని, త్రివిక్రమ్ ఓ సినిమా కోసం చేతులు కలపనున్నారా?


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories