బాలీవుడ్ పరిశ్రమలో కరోనా మహమ్మారి తర్వాత వరుస ఫ్లాప్లను ఎదుర్కుంటున్న సమయంలో విడుదలయిన. బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ సూపర్ హిట్ గా నిలిచి హిందీ ప్రేక్షకులకు పరిశ్రమ వర్గాలకు కాస్త ఊరటనిచ్చింది. రణబీర్ కపూర్ హీరోగా అలీయా భట్ హీరోయిన్ గా అయాన్ ముఖర్జీ దర్శత్వంలో ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచీ ప్రేక్షకులు ఈ సినిమా సీక్వెల్స్ ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు.
ఎట్టకేలకు దర్శకుడు అయాన్ ముఖర్జీ తన చిత్రం బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివ సీక్వెల్స్ గురించి అనేక కొత్త అప్డేట్లను తన అభిమానులు మరియు అనుచరులతో పంచుకున్నారు. మంగళవారం అయాన్ సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘ నోట్ ను పోస్ట్ చేశారు.
ఈ సినిమా సీక్వెల్ ల కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తితో ఉన్నారు. తాజాగా ఈ సినిమా పార్ట్ 2 అండ్ పార్ట్ 3 రిలీజ్ డేట్ కా పై అప్డేట్ ఇచ్చారు అయాన్. బ్రహ్మాస్త్ర పార్ట్ 2 సినిమా 2026 డిసెంబరులో.. అలాగే ఈ సినిమా పార్ట్ 3 ను 2027 డిసెంబర్లో రిలీజ్ చేయనున్నారని ఆయన తెలిపారు. దాంతో పాటు అభిమానులను ఉద్దేశించి ఓ ఓపెన్ లెటర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఒకేసారి బ్రహ్మాస్త్ర 2 3 భాగాల షూటింగును జరుపుతామని అలానే పెద్దగా తేడా లేకుండా ఈ రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వివరించారు.
ప్రస్తుతం బ్రహ్మాస్త్ర పార్ట్ 2 స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారని సమాచారం. మొదటి భాగానికి దర్శకధీరుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. మైథలాజికల్ ఫాంటసీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన బ్రహ్మాస్త్ర చిత్రం థియేటర్లోనే కాదు కాకుండా ఓటీటీలో కూడా రికార్డులు సృష్టించింది.
2022 సెప్టెంబర్లో విడుదలైన బ్రహ్మాస్త్ర చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, అలియా భట్, మౌనీ రాయ్, నాగార్జున, షారుఖ్ ఖాన్ తదితరులు నటించారు. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ స్టూడియోస్, అయాన్ ముఖర్జీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం మిశ్రమ సమీక్షలను అందుకుంది. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ₹ 431 కోట్ల గ్రాస్ తో ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచింది.