Homeసినిమా వార్తలుఇండియన్-2 బడ్జెట్ లెక్కింపుల వలన కోట్లు నష్టపోయిన దిల్ రాజు

ఇండియన్-2 బడ్జెట్ లెక్కింపుల వలన కోట్లు నష్టపోయిన దిల్ రాజు

- Advertisement -

మినిమమ్ గ్యారంటీ సినిమాలను రూపొందిస్తూ.. బడ్జెట్ విషయంలో ఖచ్చితమైన లెక్కలతో సక్సెస్ రేట్ ఎక్కువ ఉండేలా చూసుకున్న నిర్మాత దిల్ రాజు. ఆయనతో కలిసి పని చేసిన వారయినా.. లేదా ఇండస్ట్రీలోని ఇతర సభ్యులకయినా ఖర్చుల విషయంలో ఆయన ఎంత పక్కాగా ఉంటారు అనేది స్పష్టంగా తెలుసు.

అలా ప్రతి విషయంలోనూ జాగర్తగా ఉంటారు కాబట్టే కెరీర్లో ఆయన నిర్మించిన సినిమాలలో ఎక్కువ శాతం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే కెరీర్ ప్రారంభించిన కొత్తలో నూతన దర్శకులను ఎక్కువగా పరిచయం చేసిన దిల్ రాజు క్రమంగా ఆ పద్ధతి మానుకుని స్టార్ దర్శకులు మరియు స్టార్ హీరోల కాంబినేషన్లో భారీ కమర్షియల్ చిత్రాలను తీస్తూ వస్తున్నారు.

అయితే క్రికెట్ లో బ్యాట్స్మెన్ తన ఫేవరెట్ షాట్ కే ఫీల్డర్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయినట్టు, ఏ బడ్జెట్ లెక్కింపుల కారణంగా దిల్ రాజు తన కెరీర్లో దీర్ఘకాలం విజయవంతమైన సినిమాలు అందించారో.. అవే లెక్కింపుల వల్ల ప్రస్తుతం కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చుకున్న పరిస్థితి ఏర్పడింది.

వివరాల్లోకి వెళితే.. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ – కమల్ హాసన్ కలయికలో 1996లో వచ్చిన భారతీయుడు సినిమా సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. తెలుగులో కూడా ఆ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. ఈ భారీ కాంబోను తన బ్యానర్ లో మళ్లీ రిపీట్ చేయాలని ప్రయత్నించిన దిల్ రాజు.. ఐదేళ్ల క్రితం భారీ స్థాయిలో ఈ సినిమాని లాంచ్ చేసారు. అయితే సినిమాని అధికారికంగా ప్రకటించిన నెల లోపే ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.

అయితే ఇప్పుడు ఆ నిర్ణయం వల్ల దిల్ రాజు కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చి పెట్టుకున్నట్లు అయింది. కమల్ హాసన్ స్టార్‌డమ్‌కు, శంకర్ పెట్టించే బడ్జెట్ కు సినిమా నుండి లాభాలు ఆర్జించడం కష్టమని భావించారు దిల్ రాజు. ఆ తర్వాత దిల్ రాజు స్థానంలో వచ్చిన లైకా ప్రొడక్షన్స్ కూడా ఇదే కారణాన్ని సూచించి షూటింగ్ మధ్యలోనే సినిమాని ఆపేశారు. అయితే కమల్ హాసన్ ఇటీవలే నటించిన విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ విజయంతో దిల్ రాజు మరియు లైకా ప్రొడక్షన్స్ నిర్ణయం తప్పు అని నిరూపించబడింది.

READ  నవంబర్లో ఆది రీ రిలీజ్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గట్టి సవాలే

విక్రమ్ ఘన విజయంతో కమల్ హాసన్ తన స్టార్ స్టేటస్ ను తిరిగి అంది పుచ్చుకున్నారు. ఆయన స్టార్డం ఎప్పుడు కూడా కోల్పోలేదు, కేవలం సరైన సినిమాలు తీయకపోవడం వల్లే విజయాలు దక్కలేదు కానీ సినిమాలో కంటెంట్ బాగుంటే విజయం సాధించడం పక్కా అని విక్రమ్ సినిమా ఫలితంతో ఆయన నిరూపించారు.

కాగా ఇటీవలే ఇండియన్ 2 షూటింగ్ పునఃప్రారంభమైంది. అంతే కాక ఈ చిత్రానికి ట్రేడ్ వర్గాల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయి, ఈ చిత్ర నిర్మాతలయిన లైకా ప్రొడక్షన్స్, ఉదయనిధి స్టాలిన్ ఖచ్చితంగా భారీ లాభాలను తన ఖాతాలో జమ చేసుకుంటారని అందరూ భావిస్తున్నారు. ఆ రకంగా దిల్‌ రాజు వేసిన తప్పుడు లెక్కల వలన పెద్ద అవకాశాన్ని వదులుకోవడం మాత్రమే కాకుండా కోట్లల్లో డబ్బును కూడా పోగొట్టుకున్నారని ఇండస్ట్రీ వర్గాల వారు అనుకుంటున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  విజయ్ ' వరిసు ' సినిమాకి రికార్డు స్థాయిలో జరుగుతున్న నాన్ థియేట్రికల్ బిజినెస్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories