Homeసినిమా వార్తలుదిల్ రాజు కావాలనే కార్తీకేయ-2 ని టార్గెట్ చేస్తున్నారా?

దిల్ రాజు కావాలనే కార్తీకేయ-2 ని టార్గెట్ చేస్తున్నారా?

- Advertisement -

తెలుగు సినిమా అనే కాదు భారతీయ సినిమా చరిత్రలోనే సీక్వెల్ చిత్రాలకు, మరియు ఫ్రాంచైజీ చిత్రాలు అంటే ప్రేక్షకులు చాలా ఆసక్తి చూపుతారు. అలాంటి కోవకు చెందిన సినిమానేనిఖిల్ నటించిన కార్తికేయ-2. తెలుగు సినిమాల్లో అత్యంత ఆసక్తికరమైన ఫ్రాంచైజీలలో కార్తీకేయ ఒకటి.

2014 లో విడుదలైన కార్తికేయ.. ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుని సూపర్ హిట్ గా నిలిచింది. అంతే కాకుండా హీరో నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా కూడా అవతరించింది.తొలి భాగానికి మంచి ఆదరణ లభించడంతో చిత్ర బృందం కార్తికేయ 2 ను ప్లాన్ చేశారు. సీక్వెల్ ను ప్రకటించిన రోజు నుంచే ఈ చిత్రం పట్ల తెలుగు ప్రేక్షకుల్లో చక్కని ఆసక్తి ఏర్పడింది. కానీ దురదృష్టవశాత్తూ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. గత కొన్ని నెలలుగా ఈ చిత్రానికి విడుదల తేదీ దొరకడం లేదు. సినిమా విడుదల పదే పదే వాయిదా పడుతూ వస్తోంది.

మొదట అనుకున్న దాని ప్రకారం అయితే ఈ చిత్రాన్ని జూలై 22 న విడుదల చేయాలని చిత్ర బృందం అనుకున్నారు, అయితే అదే రోజు అక్కినేని నాగ చైతన్య నటించిన థాంక్యూ సినిమా విడుదల చేసిన కారణంగా నిర్మాత దిల్ రాజు కార్తీకేయ సినిమాను వాయిదా వేయించారు.

READ  ది వారియర్ OTT రిలీజ్ ఎప్పుడంటే..

దిల్‌ రాజు కారణంగా కార్తికేయ-2 మరో తేదీకి వాయిదా పడిన విషయాన్ని హీరో నిఖిల్ పలు ఇంటర్వ్యూలలో వివరించారు. ఇతర చిత్రాలకు, మొత్తంగా తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి ఇబ్బందీ ఉండకూడదని దిల్ రాజు మమ్మల్ని అడిగారని, అయితే ఎంతకాలం అని విడుదల తేదీని వాయిదా వేస్తూ ఉండగలం అని నిఖిల్ మీడియా సమక్షంలో వాపోయారు.

ఇక ఎన్నో అవాంతరాల తర్వాత ఎట్టకేలకు రేపు విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకి మరో ఇబ్బంది వచ్చి పడింది. అదే థియేటర్ల సమస్య.. కార్తీకేయ-2 చాలా తక్కువ థియేటర్లలో విడుదలవుతోంది. ఈ చిత్రం పట్ల ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉన్నా కూడా ఈ సినిమాకి తగిన ధియేటర్లు దొరకకపోవడం విచారకరం. ఈ సందర్భంగా దిల్ రాజు కావాలనే నిఖిల్ ని టార్గెట్ చేస్తున్నారని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ వాదనలో పూర్తిగా నిజం ఏదో ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే సినిమా పరిశ్రమలో ఒక్కోసారి ఇలా కొంతమంది ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగని ప్రతిసారీ ఇలాంటివి ఎవరో కావాలని చేశారు అని అనుకోవడం సరి కాదు.

Follow on Google News Follow on Whatsapp

READ  ఇస్మార్ట్ శంకర్ తో హరీష్ శంకర్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories