దిల్ రాజు తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ మరియు టాప్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్లలో ఒకరు. గతంలో తెలుగు చిత్ర పరిశ్రమలో వివాదాలు తలెత్తినప్పుడు చక్కని ఆధారాలతో పాటు పక్కా లాజిక్స్ తో మాట్లాడేవారు.
కానీ దిల్ రాజుకు ఏమైందో తెలియదు కానీ ఆయన తాజాగా చేస్తున్న వ్యాఖ్యలు అన్నీ మూర్ఖంగా అనిపిస్తున్నాయి. తమిళనాట అజిత్ కంటే విజయ్ పెద్ద స్టార్ అని, అందుకే తమిళనాడులో విజయ్ నటించిన వారిసు సినిమాకు అదనపు స్క్రీన్లు కావాలని ఆయన డిమాండ్ చేశారు.
తమిళనాట కాకుండా ఇతర ప్రాంతాల్లో అజిత్ కంటే విజయ్ కు భారీ ఆధిక్యం ఉండటం గమనార్హం. కానీ తమిళనాడులో అజిత్ కు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉండటం వల్ల విజయ్ తో సమానంగానే ఉన్నారు.
ఒక్క క్షణం దిల్ రాజు మాటలు నిజమే అనుకున్నా.. అదే లాజిక్ ను తెలుగులో అన్వయిస్తే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలకు ఎక్కువ థియేటర్లు సమకూర్చాలి. అయితే ఇక్కడ దిల్ రాజు మాత్రం వారసుడు సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో థియేటర్లను అందిస్తున్నారు.
తన సొంత లాజిక్ ఫాలో అయితే విజయ్ కి బాలకృష్ణ, చిరంజీవి సినిమాలకు ఇచ్చే థియేటర్లలో ఒకటిన్నర శాతం కూడా స్క్రీన్లు దక్కేవి కావు. కానీ దిల్ రాజు మాత్రం వారసుడు కోసం బాలకృష్ణ, చిరంజీవి సినిమాలతో సమానంగా స్క్రీన్లను లాక్ చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో దిల్ రాజు ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. కాబట్టి, ఈ రకమైన ప్రకటనలు ఇచ్చేటప్పుడు ఆయన జాగ్రత్తగా ఆలోచించాలి, లేకపోతే అది ఆయనకి మరింత సమస్యాత్మక పరిస్థితులను సృష్టిస్తుంది.