Homeసినిమా వార్తలుగొప్ప లాజిక్ పట్టుకున్న దిల్ రాజు

గొప్ప లాజిక్ పట్టుకున్న దిల్ రాజు

- Advertisement -

కరోనా తరువాత తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయని, సినిమాలు నిర్మించడం మరియు వ్యాపారం నిర్మాణ వ్యయంతో పాటు వ్యాపార విషయాల్లో నష్టాలు ఎక్కువయ్యాయని, అంతే కాకుండా చిత్ర నిర్మాణం లో భాగంగా వేస్టేజీ కూడా బాగా పెరిగిపోయిందని, అంతే కాకుండా నటీనటుల పారితోషికాలు కూడా నిర్మాతలకు భారంగా మారాయని ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులు పరిశ్రమలో షూటింగ్ల బంద్ ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆగస్టు 1 నుంచి షూటింగ్ లన్నీ నిలిపి వేస్తున్నామని.. అందులో భాగంగా నిర్మాణంలో ఉన్న సినిమాలతో పాటు షూటింగ్ ప్రారంభం అవుతున్న సినిమాల షూటింగ్ లు కూడా ఆపెస్తామని, నిర్మాతల గిల్డ్ తరపున దిల్ రాజు ఆదివారం ప్రకటించారు.

ముందు నుంచి గిల్డ్ ప్రతిపాదించిన షూటింగ్ ల బంద్ ని నిర్మాతల మండలిలో ఉన్న చిన్న నిర్మాతలు వ్యతిరేకించినా.. చివరికి అందరూ ఓకే నిర్ణయానికి కట్టుబడ్డారు. దీంతో ఆగస్టు 1 నుంచి తెలుగు సినీ పరిశ్రమలో షూటింగులు అన్నీ ఆగిపోయే పరిస్తితి వచ్చింది.

ఇదిలా ఉండగా పరిశ్రమలో అగ్ర నిర్మాతగా చలామణి అవుతూ, ప్రొడ్యూసర్ గిల్డ్ లో కూడా కీలకంగా వున్న ఒక నిర్మాత మాత్రం చాలా మామూలుగా తన సినిమా షూటింగ్ ని ఆపడం లేదని, అంతే కాకుండా వైజాగ్ లో తాజా షెడ్యూల్ ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో ఈ వార్త విన్న ఇతర నిర్మాతలతో పాటు ఇండస్ట్రీ వర్గాలు నిర్ఘాంతపోతున్నారు.

READ  యాక్షన్ కింగ్ తో విశ్వక్ సేన్

అందుకు కారణం లేకపోలేదు.. అసలు ఈ షూటింగులు ఆపేసే నిర్ణయాన్ని మొదటి నుంచీ సమర్ధిస్తూ అందరికీ పిలుపునిచ్చిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన సినిమా షూటింగ్ ని వైజాగ్ లో ప్లాన్ చేసుకోవడమే ఇప్పడు అందరిలోనూ చర్చకు దారి తీసింది.

వివరాల్లోకి వెళితే.. తమిళ సూపర్ స్టార్ హీరో విజయ్ హీరోగా దిల్ రాజు తమిళ తెలుగు భాషల్లో ద్విభాషా చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. తెలుగులో ‘వారసుడు’ పేరుతో.. తమిళంలో ‘వారీసు’ పేరుతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ ని వైజాగ్ లో ప్లాన్ చేశారట. అదేంటి ఈరోజుతో షూటింగులు అన్నీ ఆపేస్తాము అని చెప్పి ఇలా షూటింగ్ చేయడం ఏంటని చాలా మంది ఇతర నిర్మాతలు ఈ విషయం పై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారట.

అయితే అందుకు బదులుగా దిల్ రాజు మాత్రం ఆసక్తికరమైన సంజాయిషి వినిపిస్తున్నారని తెలుస్తోంది. అదేంటంటే . తాను విజయ్ తో చేస్తున్న సినిమా తమిళ సినిమా కానీ స్ట్రెయిట్ తెలుగు సినిమా కాదు. తమిళ సినిమాను తెలుగులో డబ్ చేస్తారట. అందువల్ల తమిళ సినిమాకు టాలీవుడ్ బంద్ కు ఎలాంటి సంబంధం లేదన్నది ఆయన మాటగా అంటున్నారు.

మరి అలాంటప్పుడు ధనుష్ – వెంకీ అట్లూరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘సార్’, శంకర్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లలో రూపొందుతున్న సినిమాలు కూడా అదే కోవలోకి చెందుతాయా?ఆయా చిత్ర యూనిట్లు కూడా యధావిధిగా షూటింగ్ చేసుకోవచ్చా? అని కొంత మంది నిర్మాతలతో పాటు సోషల్ మీడియాలో ప్రేక్షకులు కూడా సెటైర్ లు వేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

READ  నాగ చైతన్య మీద ఆగని పుకార్లు

గిల్డ్ ప్రతినిధిగా షూటింగులు ఆపేయడం అనే నిర్ణయాన్ని అంతా తానై ముందుండి నడిపించిన సదరు నిర్మాతే ఆ నియమాన్ని పాటించకపోతే మరి మిగతా వాళ్లు ఎలా పాటిస్తారు? వారు కూడా ఏదో ఒక కారణం లేదా లాజిక్ చెప్పి షూటింగ్లను కొనసాగిస్తే ఇంక ఏ రకమైన బంద్ లు జరగడానికి ఆస్కారం ఉండదు మరి.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories