Homeసినిమా వార్తలుDid Devara Impress Japan Audiance జపాన్ ఆడియన్స్ ని 'దేవర' ఆకట్టుకుంటుందా ?

Did Devara Impress Japan Audiance జపాన్ ఆడియన్స్ ని ‘దేవర’ ఆకట్టుకుంటుందా ?

- Advertisement -

యంగ్ టైగర్ పాన్ ఇండియన్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఇటీవల తెరకెక్కిన సినిమా దేవర పార్ట్ 1. గత ఏడాది సెప్టెంబర్ 27న భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా అయితే నిలిచింది. జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించిన దేవర పార్ట్ 1 మూవీలో ఎన్టీఆర్ రెండు పాత్రల్లో కనిపించి తన అత్యద్భుత పర్ఫామెన్స్ తో అందర్నీ అలరించారు ఎన్టీఆర్. 

అనిరుద్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలు భారీ స్థాయిలో పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మించాయి. విషయం ఏమిటంటే మార్చి 28న ఈ సినిమా జపాన్ లో గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. 

అక్కడ ఎన్టీఆర్ కి మంచి క్రేజ్, ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు ఎన్టీఆర్. నేడు వీడియో మీట్ ద్వారా జపాన్ లోని మీడియా ప్రతినిధులతో అలానే అక్కడి వారితో ప్రత్యేకంగా మాట్లాడిన ఎన్టీఆర్ ఈనెల 22న జపాన్ వెళ్ళనున్నారు. 

READ  is skn criticism about that young actress ఎస్ కె ఎన్ విమర్శలు ఆ యువ నటిని ఉద్దేశించేనా ?

అనంతరం అక్కడ ప్రమోషన్స్ మరింత గ్రాండ్ గా నిర్వహించనుండగా మార్చి 28న దేవర మూవీ అక్కడ ఆడియన్స్ ముందుకు రానుంది. మరి దేవర పార్ట్ 1 ఎంత మేర జపాన్ లో ఆకట్టుకుంటుందో, ఏ స్థాయిలో కలెక్షన్ అందుకుంటుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories