ధనుష్ తాజా ద్విభాషా చిత్రం వాతి/సార్ తెలుగు, తమిళ భాషల్లో పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది మరియు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ వసూలు చేసి ధనుష్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఫిబ్రవరి 17న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం 2023 మార్చి 17 నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
సాధారణంగా ప్రేమకథలు తీయడంలో దిట్టగా పేరొందిన దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాతో సీరియస్ ఇష్యూను హ్యాండిల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. విద్యను ప్రైవేటీకరణ చేసే క్రమంలో దొర్లే లోపాల పై దృష్టి సారించిన ఈ చిత్రంలో నిజాయితీగా నడిపిన కథనం, ధనుష్ సహజ నటన ప్రేక్షకుల మెప్పు పొందాయి.
ప్రేక్షకుల నుండి అద్భుతమైన నోటి మాటతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన లాంగ్ రన్ ను సాధించింది. ఈ సినిమా పై చిత్ర నిర్మాణ యూనిట్ కు అపారమైన నమ్మకం ఉండడంతో విడుదల తేదీకి ముందే పెయిడ్ ప్రీమియర్స్ ఏర్పాటు చేయగా వారి స్ట్రాటజీ బాగా వర్కవుట్ అయింది. పెయిడ్ ప్రీమియర్స్, మార్నింగ్ షోల నుంచి సార్ సినిమాకు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ తో బాక్సాఫీస్ వద్ద సూపర్బ్ కలెక్షన్స్ రాబట్టడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ధనుష్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించారు. సముద్రఖని, సాయికుమార్, తనికెళ్ల భరణి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.