ధనుష్ తాజాగా నటించిన ద్విభాషా చిత్రం సార్/వాతి సినిమా విజయపథంలో దూసుకుపోతుంది. ముఖ్యంగా తెలుగు వెర్షన్ సార్ తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. కాగా రెండవ రోజు వసూళ్లు మొదటి రోజు కలెక్షన్‌తో సమానంగా ఉండడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం అనేక ప్రాంతాలలో బ్రేక్ ఈవెన్‌ను సాధించింది.
ధనుష్ అద్భుతమైన నటన, భావోద్వేగ సన్నివేశాలు.. చక్కని డైలాగులకు తోడు జివి ప్రకాష్ ఘనమైన నేపథ్య సంగీతం, పాటల ప్రేక్షకులను ఈ సినిమా ఆకర్షించడంలో బాగా సహాయ పడ్డాయి అని చెప్పాలి.
ధనుష్ సార్ మొదటి వారాంతపు కలెక్షన్ల వివరాలు:
- నైజాం – 6.7 కోట్లు
- సీడెడ్ – 2.25 కోట్లు
- ఉత్తరాంధ్ర – 2.15 కోట్లు
- ఈస్ట్ – 1.5 కోట్లు
- వెస్ట్ – 0.67 కోట్లు
- గుంటూరు – 1.35 కోట్లు
- కృష్ణ – 1 కోటి
- నెల్లూరు – 0.6 కోట్లు
మొత్తం – ఆంధ్రా/తెలంగాణ – 16.22 కోట్లు
నిజానికి ధనుష్ కి రఘువరన్ బీ టెక్ తర్వాత తెలుగులో సరైన విజయం లేదు. అయితే సార్ కేవలం ఒక డబ్బింగ్ సినిమా లాగా కాకుండా ఒక ద్విభాషా చిత్రంగా తెరకెక్కడం, ధనుష్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రచార కార్యక్రమాలలో పాలు పంచుకోవడం సినిమాకి బాగా కలిసి వచ్చింది.
వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్, సముద్రఖని, హైపర్ ఆది, సాయి కుమార్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందించారు.
సార్ సినిమాని దూకుడు గల మార్కెటింగ్ టెక్నిక్ లతో నిర్వహించారు. అందుకే ధనుష్ యొక్క వాతి/సార్ తెలుగు రాష్ట్రాలలో భారీ హైప్‌ని సృష్టించింది మరియు బాక్సాఫీస్ వద్ద బాగా రాణిస్తుందని అంచనా వేయబడింది. కాగా చిత్ర కథాంశం పై భారీ నమ్మకంతో నిర్మాతలు విడుదల ఒక రోజు పెయిడ్ ప్రీమియర్లను కూడా ఏర్పాటు చేశారు.