Homeసినిమా వార్తలుధనుష్ 3 సినిమా స్పెషల్ షోలకు అద్భుతమైన స్పందన

ధనుష్ 3 సినిమా స్పెషల్ షోలకు అద్భుతమైన స్పందన

- Advertisement -

తమిళ హీరో ధనుష్ తాజాగా నటించిన చిత్రం తిరుచిత్రంబళం ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విజయం తర్వాత ధనుష్ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూలు చేసి సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ధనుష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కూడా నిలిచింది.

అయితే ఆయన ఆనందాన్ని మరింత పెంచే విషయం ఒకటి ఇప్పుడు బయటపడింది. ధనుష్ నటించిన 3 చిత్రం హైదరాబాద్‌లోని కొన్ని థియేటర్లలో రీ-రిలీజ్ చేయబడింది. ఆ షోలకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ధనుష్‌కి తెలుగు రాష్ట్రాల్లో నటుడిగా ఎంతో మంచి పేరు ఉంది. ఆయన చేసే తమిళ సినిమాలను కూడా ఫాలో అవుతూ ఆ సినిమాలను.కుదిరితే ధియేటర్లలో లేదా OTT లో ఆ సినిమాలను చూసి తమ స్పందనను తెలియజేస్తుంటారు, ఒక పరభాషా నటుడికి ఈ స్థాయి క్రేజ్ ఉండటం అతని ప్రతిభకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

అయితే నటుడిగా మంచి ఇమేజ్ ఉండటం వేరు, బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు లేదా ఓపెనింగ్లు తెచ్చిపెట్టే అభిమానులు ఉండటం వేరు. అలా చూసుకుంటే సాధారణంగా ధనుష్ సినిమా థియేటర్లలో విడుదలైతే తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ వద్ద మామూలు స్పందన వస్తుంది. ఒకవేళ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే, అప్పుడు మాత్రం ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేవారు. కానీ అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా, ధనుష్ పదేళ్ల క్రితం నటి 3 చిత్రం యొక్క రీ-రిలీజ్‌కు మాత్రం గొప్ప స్పందన వచ్చింది. ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతున్నారు.

READ  Box-Office: ఈ వారం తెలుగు సినిమాల రిపోర్ట్

నిజానికి 3 సినిమాకి స్పెషల్ షోలు ప్రకటించినప్పుడు ఎవ్వరూ ఆసక్తి చూపరని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా స్పెషల్ షోలకు అయిన బుకింగ్స్ చూస్తే చాలా షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ మరి కొన్ని సోల్డ్ ఔట్ గా నమోదయ్యాయి. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా మాత్రమే ఈ సినిమా విడుదలకు ముందే 30 శాతం ఆక్యూపెన్సీతో 12 లక్షలకు పైగా గ్రాస్ వసూలు చేయడం విశేషం.

2012 సంవత్సరంలో విడుదలైన 3 సినిమాలో ధనుష్ కు జోడీగా శృతి హాసన్ నటించారు. శివకార్తికేయన్, ప్రభు,భానుప్రియ,రోహిణి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఐశ్వర్య ధనుష్ దర్శకుడు కాగా అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడుగా వ్యవహరించారు. 3 సినిమాలోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఇప్పటికీ సోషల్ మీడియాలో నెటిజన్లు ఇష్టంగా వింటారు.

Follow on Google News Follow on Whatsapp

READ  నన్ను సూపర్ స్టార్ అని పిలవద్దు - విజయ్ దేవరకొండ


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories