తన తొలి చిత్రం పెళ్లిసందD లో తన అందం, మంచి లుక్స్ తో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు శ్రీలీల. ఆమె పరిశ్రమలో గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపడమే కాకుండా నటిగా అద్భుతమైన ఆఫర్లు మరియు క్రేజ్ అందుకున్నారు. ప్రేక్షకులు కూడా ఆమెను తెర మీద చూసి ఆనందిస్తున్నారు.
రవితేజ నటించిన ధమాకా సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడానికి ప్రధాన కారణాల్లో హీరోయిన్ శ్రీలీల ఒకరు మరియు ఈ చిత్రంలో ఆమె తన నటన మరియు డాన్సులతో, ఎనర్జీ లెవల్స్ తో అందరినీ మంత్రముగ్ధులను చేసారు. మొత్తానికి ధమాకా చిత్రం ఆమె కెరీర్ లో ఒక టర్నింగ్ పాయింట్ గా మారింది.
ఇప్పుడు నిర్మాతలు ఆమెను ఏ రకమైన సినిమాల్లోనైనా సులభంగా తీసుకోవచ్చు, ముఖ్యంగా అది గానీ కమర్షియల్ చిత్రం అయితే. ధమాకా సినిమాలో నిరూపించుకున్న తీరుగా ఆమె సినిమాకి చాలా ఉపయోగపడతారు.
ధమాకా విడుదలకు ముందు శ్రీలీల మీడియాతో మాట్లాడుతూ పెళ్లిసందD విడుదలకు ముందే ఈ చిత్రాన్ని తనకు ఆఫర్ చేశారని చెప్పారు.
కథ వింటున్న సమయంలో, రొమాన్స్ మరియు సరదా సన్నివేశాలకు చాలా అవకాశం ఉన్నందున ఆమె పాత్రతో సంతోషించారట. తన కెరీర్ లో ఇంత త్వరగా రవితేజ లాంటి స్టార్ హీరోతో జతకట్టడం సంతోషంగా ఉందని భావించి ఈ సినిమా చేయడానికి అంగీకరించానని శ్రీలీల తెలిపారు.
శ్రీలీల ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడిల సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక త్వరలో రామ్ పోతినేని మరియు బోయపాటి శ్రీను సినిమా సెట్స్ లో జాయిన్ కానునన్నారు.
అంతే కాకుండా, ఆమె చాలా కాలంగా పంజా వైష్ణవ్ తేజ చిత్రం షూటింగ్ లో కూడా ఉన్నారు. ఆ పైన యువ హీరో నితిన్ తో ఇంకా పేరు పెట్టని ఓ కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభించడానికి కూడా ఆమె సిద్ధంగా ఉన్నారు.