రవితేజ ధమాకా ఈ శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు త్రినాధరావు నక్కిన కాంబినేషన్లో తొలిసారిగా ఈ సినిమా తెరకెక్కింది. నిజానికి తొలి రోజు కాస్త మిశ్రమ సమీక్షలను అందుకున్నా.. మాస్ ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు అద్భుతమైన స్పందన రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.
తొలి మూడు రోజుల మంచి ప్రదర్శన తర్వాత, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన పట్టును మరింత బలంగా నిలుపుకుంది. ఈ చిత్రం సెలవు దినాల్లో మంచి వసూళ్లు సాధిస్తుందని అందరూ ఊహించారు. కానీ సోమవారం నుండి ధమాకా అందుకున్న స్థిరమైన నంబర్ల చూసి ఆశ్చర్యపోవడం అందరి వంతయింది.
ఈ రోజు నాటికి ఈ చిత్రం 20 కోట్ల షేర్ మార్క్‌ను దాటింది, ధమాకా యొక్క థియేట్రికల్ బిజినెస్ విలువ 19 కోట్లు కాగా సినిమా రన్ అయిన 5 రోజుల్లోనే బ్లాక్ బస్టర్ స్టేటస్‌ను సాధించడం విశేషం.
ఇక సంక్రాంతి సినిమాలు వచ్చే వరకూ ధమాకా సినిమాకి ఎదురుగా నిలిచే మరే సినిమా లేకపోవడంతో ఈ వీకెండ్ వరకు ఇదే జోరును కొనసాగించాలని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది రవితేజకు చాలా అవసరమైన బ్లాక్‌బస్టర్ మరియు ధమాకా బ్లాక్ బస్టర్ కావడంతో ఆయన అభిమానులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు.
రవితేజ యొక్క ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ మరియు సినిమాలోని కొన్ని మాస్ మూమెంట్స్, యంగ్ అండ్ వైబ్రెంట్ శ్రీలీల గ్లామర్ మరియు డ్యాన్స్‌లతో పాటు, భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన సంగీతం కూడా ఈ సినిమాకి ప్రయోజనం చేకూర్చాయి.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై ధమాకా చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి టిజి విశ్వ ప్రసాద్ నిధులు సమకూర్చగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు.