ధమాకా ఓటీటీ హక్కులను ప్రముఖ దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. కాగా రాబోయే వారాల్లో ఈ ప్లాట్ ఫామ్ నుంచి ఇదే విషయమై అధికారిక ధృవీకరణ రాబోతుందని తెలుస్తోంది.
రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ధమాకా ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. డిసెంబర్ 23న వెండి తెర పైకి వచ్చిన ఈ చిత్రం మిశ్రమ సమీక్షలను అందుకుంది. అయితే మాస్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటూ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ తో సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తోంది.
దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రం అతని కెరీర్ లో మరో విజయంగా నిలిచింది. ఆయన కమర్షియల్ ఎలిమెంట్స్ సరైన విధంగా మిక్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే మంచి ఫార్ములాను సొంతం చేసుకున్నారు.
ధమాకాలో రవితేజ మాస్ డైలాగులు, మ్యానరిజమ్స్ తో పాటు శ్రీలీల ఎనర్జీ, డ్యాన్సులు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. విడుదలకు ముందే జింతాక, మాస్ రాజా పాటలు బాగా ప్రాచుర్యం పొందడంతో ఆ పాటలు కూడా సినిమాకు ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.
ఇప్పుడు అందరి దృష్టి కూడా ధమాకా సోమవారం ఎలా ఆడుతుంది అనే దాని మీద ఉంది. ఒక చిత్రం యొక్క పనితీరుకు అసలైన పరీక్షగా సోమవారం పరిగణించబడుతుంది మరియు ఈ చిత్రం సోమవారం బాక్సాఫీస్ వద్ద నిలకడగా ఉంటే, ధమాకా బృందానికి భారీ ఉపశమనం లభిస్తుంది.
రావు రమేష్, జయరామ్, సచిన్ ఖేడ్కర్, ప్రవీణ్, పవిత్ర లోకేష్, తనికెళ్ల భరణి తదితరులు ధమాకా చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరిలియో సంగీతం అందించారు.