రవితేజ ధమాకా బాక్సాఫీస్ వద్ద తన అద్భుతమైన రన్ ను కొనసాగిస్తూ కొత్త సంవత్సరాన్ని రికార్డు బ్రేక్ నోట్ తో ప్రారంభించింది. డిసెంబర్ 23 న మిశ్రమ సమీక్షలతో విడుదలైన ఈ చిత్రం క్రమంగా పుంజుకుంది మరియు ప్రధానంగా మాస్ ఎలిమెంట్స్ కారణంగా థియేటర్లు అన్నీ ప్యాక్డ్ హౌస్ లుగా ఉంటున్నాయి.
ధమాకా చిత్రం 10 వ రోజు 4.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసి తెలుగు రాష్ట్రాల్లో 10వ రోజు కలెక్షన్స్ లో సరికొత్త నాన్-రాజమౌళి రికార్డును సృష్టించింది. ఈ మాస్ ఎంటర్ టైనర్ ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల షేర్ మార్క్ ను క్రాస్ చేసి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ధమాకా అద్భుతమైన ఆక్యుపెన్సీలను నమోదు చేస్తోంది మరియు చాలా చోట్ల ఈ వారాంతంలో హౌజ్ ఫుల్ బోర్డులను నమోదు చేసింది.
మాస్ మహారాజా, త్రినాథరావు నక్కిన కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రమిది. ఈ చిత్రంలో రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో పాటు ప్రేక్షకులను అలరించే మాస్ మూమెంట్స్, అలాగే భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ కూడా సినిమాకు అడ్వాంటేజ్ గా నిలిచాయి.
ఇక యంగ్ హీరోయిన్ శ్రీ లీల అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు డ్యాన్స్ స్కిల్స్ కూడా ఈ చిత్రానికి సాలిడ్ బజ్ సృష్టించాయి. అంతే కాకుండా ఈ చిత్రం ఇంత ఘన విజయం సాధించడం తన కెరీర్ కు కూడా ఒక టర్నింగ్ పాయింట్ లా నిలిచింది.
ధమాకా విడుదలైన 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ స్టేటస్ సాధించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ స్టేటస్ సాధించింది. 19 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమా దిగ్విజయం సాధించి కమర్షియల్ సినిమా ఆధిపత్యాన్ని మరోసారి చూపించింది.