టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప 2 ది రూల్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి అతి పెద్ద విజయం సొంతం చేసుకున్నారు.
ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా కనిపించగా కీలక పాత్రల్లో ఫహాద్ ఫాసిల్, రావు రమేష్, బ్రహ్మాజీ, అనసూయ, సునీల్ నటించారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ మూవీని భారీ వ్యయంతో పాన్ ఇండియన్ రేంజ్ లో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మించింది.
ఇక ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ.1670 కోట్లని రాబట్టిన పుష్ప 2 మూవీ యొక్క సక్సెస్ మీట్ ని నిన్న హైదరాబాద్ లో యూనిట్ సభ్యులు మరియు డిస్ట్రిబ్యూటర్లతో కలిపి నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ తనని లైఫ్ లో అత్యంత నమ్మిన హీరో అల్లు అర్జున్ మాత్రమే అన్నారు.
అలానే తన పేరు సుకుమార్ దేవిశ్రీప్రసాద్ అని, దేవితో కలిసి సినిమా చేయలేనని అన్నారు. దీనిని బట్టి తదుపరి రామ్ చరణ్ తో సుకుమార్ తీయనున్న RC 17 మూవీకి అతడే మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.