Homeసినిమా వార్తలుతొమ్మిదేళ్ళ తరువాత వస్తున్న సూర్య - దేవిశ్రీప్రసాద్ కాంబో

తొమ్మిదేళ్ళ తరువాత వస్తున్న సూర్య – దేవిశ్రీప్రసాద్ కాంబో

- Advertisement -

తమిళ స్టార్ హీరో సూర్య, మ్యూజికల్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు మంచి విజయం సాధించాయి. వీరిద్దరూ ఇప్పటి వరకు కలిసి చేసిన సినిమాలు మాయావి, ఆరు, సింగం 1 మరియు సింగం 2. ఆ సినిమాలన్నీ భారీగా విజయవంతం అవడంతో పాటు పాటలు కూడా చక్కని జనాదరణ పొందాయి. అంతే కాకుండా ఈ సినిమాలు సూర్య కెరీర్‌లో మరపురాని చిత్రాలుగా నిలిచాయి. ఆ హవాలో తమిళ మార్కెట్‌లో దేవిశ్రీప్రసాద్ ను నంబర్ వన్ స్థానంలో నిలబెట్టాయి. సూర్య – దేవిశ్రీప్రసాద్ ల కాంబినేషన్ సింగం 2 తరువాత మళ్ళీ రిపీట్ అవలేదు.

అయితే, తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం , వీరిద్దరూ మళ్ళీ కలిసి పని చేయడానికి సిద్ధం అవుతున్నారు. కమర్షియల్ సినిమాలు తీయడంలో తనదైన ముద్ర వేసిన తమిళ దర్శకుడు సిరుతై శివతో సూర్య చేయబోయే చిత్రం కోసం సూర్య – దేవీ మళ్లీ కలవనున్నారు. సూర్య ఇటీవల జై భీమ్ మరియు సూరరై పొట్రు వంటి సందేశాత్మక చిత్రాలలో తన నటనకు ఎనలేని ప్రశంసలు అందుకున్నారు. అయితే, ఆ రెండూ కూడా ధియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదలైన సినిమాలు. ఆ రెండు చిత్రాల తరువాత సూర్య నటించిన ET ( ఎవ్వరికీ తల వంచడు) థియేటర్లలో విడులైంది. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధిస్తుందని సూర్య ఆశించారు కానీ అది కూడా జరగలేదు. ఈ చిత్రం కమర్షియల్‌గా విజయం సాధించి, బాక్స్ ఆఫీస్ వద్ద కమ్ బ్యాక్ ఇద్దామన్న సూర్య ఆశ నెరవేరలేదు.

పాండిరాజ్ దర్శకత్వంలో వచ్చిన ET సినిమా ప్రధాన కదా లైంగిక వేధింపుల నేపథ్యంలో తెరకెక్కినది. ఈ చిత్రంలో సూర్య మరోసారి లాయర్ పాత్రలో మెప్పించారు. కమర్షియల్ గా విజయం సాధింలేకపోయినా నటుడిగా మాత్రం మరోసారి సూర్య ఆకట్టుకున్నారు.

READ  తమిళ హీరో విశాల్ కు షూటింగ్ లో ప్రమాదం

ఇక సిరుతై శివతో తీయబోతున్న సినిమాలో ఈ తమిళ స్టార్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారని సమాచారం. అంతే కాకుండా ఈ చిత్రాన్ని ప్యాన్-ఇండియా ప్రాజెక్ట్‌గా నిర్మిస్తారని కూడా కథనాలు సూచిస్తున్నాయి. బాలీవుడ్ భామ దిశా పటాని కథానాయికగా నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Follow on Google News Follow on Whatsapp

READ  వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నాగ చైతన్య


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories