యంగ్ టైగర్ గ్లోబల్ ఐకాన్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ ఎంటర్టైనర్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా కనిపించగా అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చారు.
ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్షన్ రాబట్టింది. ముఖ్యంగా దేవర పార్ట్ 1 ఓపెనింగ్ భారీ స్థాయిలో రాబట్టింది. ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అహఁదరగొట్టిన దేవర మూవీ ఇప్పటికే రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ తో దూసుకెళుతోంది. కాగా మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ తెలుగు రాష్ట్రాలు మినహాయిస్తే తమిళనాడులో రూ. 10 కోట్లు రాబట్టగా అందులో చాలావరకు తెలుగు వర్షన్ నుండే వచ్చింది.
మరోవైపు కేరళలో రూ. 2 కోట్లని మాత్రమే కలెక్ట్ చేసింది, ఇది చాలా తక్కువ కలెక్షన్. అటు హిందీ బెల్ట్ లో మంచి ఓపెనింగ్ రాబట్టినప్పటికీ ఓవరాల్ గా రూ. 60 కోట్ల నెట్ దగ్గర నిలిచింది. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే దేవర పార్ట్ 1 మూవీ తెలుగు వర్షన్ దాదాపుగా 80% పైగా రాబట్టగా ఇతర భాషల్లో ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేదని చెప్పాలి.