టాలీవుడ్ స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ద్వారా హీరోయిన్ గా బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ విలన్ గా సైఫ్ అలీ ఖాన్ టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు.
కొరటాల శివ తీస్తున్న ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు దీనిని గ్రాండ్ గా అత్యంత భారీ వ్యయంతో నిర్మించాయి. అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన దేవర పార్ట్ 1 మూవీకి సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన మూడు సాంగ్స్, గ్లింప్స్, థియేట్రికల్ ట్రైలర్ అన్ని కూడా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ యొక్క అవుట్ డోర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా క్యాన్సిల్ అయినట్లు చెప్తున్నారు.
దానికి కారణం ఎంతో భారీగా క్రౌడ్ హాజరు అయ్యే అవకాశము ఉండడంతో ఏదైనా సమస్య వస్తుందేమో అని పోలీస్ వారి నుండి పర్మిషన్ రాలేదట. అయితే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏదైనా ఇండోర్ ప్లేస్ లో నిర్వహించనున్నారని, దానికి సంబంధించి త్వరలో పూర్తి వివరాలు అఫీషియల్ గా వెల్లడి కానున్నట్లు చెప్తున్నారు.