టాలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ ఎంటర్టైనర్ మూవీ దేవర పార్ట్ 1. నేడు ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
ముందుగా ఎన్టీఆర్ పవర్ఫుల్ ఎంట్రీతో ఆరంభం అయిన దేవర మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా చాలా వరకు మంచి మాస్ కమర్షియల్ ఎలెమెంట్స్ తో సాగుతుంది. ముఖ్యంగా అనిరుద్ బీజీఎమ్, విజువల్స్ అన్ని అదిరిపోయాయి. ఇక వర పాత్ర ఎంట్రీతో ఆరంభమైన సెకండ్ హాఫ్ ఒకింత స్లోగా సాగుతుంది.
ఇక అయితే అక్కడి నుండి మూవీని ఆకట్టుకునే రీతిన నడపడంలో దర్శకుడు కొరటాల శివ విఫలం అయ్యారు. ముఖ్యంగా హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ తో పాటు ఎమోషన్స్ కూడా పెద్దగా కనెక్ట్ కాలేదు. ఇక సెకండ్ హాఫ్ ని అలా మెల్లగా సాగదీసిన కొరటాల చివరి ఇరవై నిముషాలు మాత్రమే బాగానే తీశారు. అయితే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ సెకండ్ పార్ట్ పై ఏమాత్రం ఆసక్తిని ఏర్పరచదు. మొత్తంగా చెప్పాలి అంటే దేవర మంచి మాస్ ఎలిమెంట్స్ తో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ అనాలి.
ప్లస్ పాయింట్స్ :
ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పెర్ఫార్మెన్స్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్
భారీ యాక్షన్ బ్లాక్‌లు మరియు సముద్ర నేపథ్యం
పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్‌లతో కూడిన బలమైన కాస్టింగ్
మొదటి సగం ఆకట్టుకుంటుంది
మైనస్ పాయింట్స్ :
లవ్ ట్రాక్
స్క్రీన్ ప్లే
ఎమోషనల్ సీన్స్ ఇంకా బాగా రాస్తే బాగుండేది
ఆకట్టుకోని ముగింపు
తీర్పు : దేవర మూవీ మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చే డీసెంట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. అయితే, మూవీ పై మీకు అంచనాలు ఎక్కువగా ఉంటే, అది కొంత నిరాశ కలిగించవచ్చు.
రేటింగ్ : 2.75 / 5