యంగ్ టైగర్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర సెప్టెంబర్ 27న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సంసిద్ధం అవుతోంది, ఓవైపు ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా మూవీ పై అంతకంతకు అంచనాలు పెంచేసాయి. ఇక మరోప్రక్క ప్రమోషన్స్ ని కూడా టీమ్ గట్టిగా నిర్వహిస్తోంది.
ఇటీవల హిందీ మీడియాని కలిసి ఇంటరాక్ట్ అయిన దేవర టీమ్, నిన్న తమిళ మీడియాని కలిసింది. అలానే అటు అమెరికాలో కూడా సందడి చేసేందుకు సిద్ధమవుతోంది ఆ మూవీ టీమ్. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న దేవర పార్ట్ 1 మూవీని కొరటాల శివ తెరకెక్కించగా అనిరుద్ సంగీతం అందించారు.
విషయం ఏమిటంటే, ఈ మూవీ నుండి ఆయుధ పూజ సాంగ్ కోసం ఎప్పటి నుండో అందరూ ఎదురు చూస్తుండగా, దానిని సెప్టెంబర్ 19న ఉదయం 11 గం. 7 ని. లకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా ప్రకటించారు. మరి ఈ విధంగా అందరిలో భారీ క్రేజ్ కలిగిన దేవర రిలీజ్ అనంతరం ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.