యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ అందాల నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మూవీ దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానున్న విషయం తెల్సిందే.
ఈ మూవీలో సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. అనిరుద్ సంగీతం అందిస్తున్న దేవర మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై బాగా అంచనాలు ఏర్పరిచాయి. కాగా మ్యాటర్ ఏమిటంటే, తాజాగా ఈ మూవీకి సంబందించి తాజాగా ఏపీ టికెట్ ధరల వివరాలు అధికారికంగా వెల్లడయ్యాయి.
మొదటి రోజు మిడ్ నైట్ షో నుండి ఆరోజు 6 షోలు, ఇక రెండవ రోజు నుండి 5 షో లకు పర్మిషన్ ఇచ్చారు. అలానే వీటితో పాటు మల్టి ప్లెక్స్ థియేటర్స్ లో రూ. 135, సింగిల్ స్క్రీన్స్ బాల్కనీ రూ. 110, సెకండ్ క్లాస్ రూ. 60 మేర రెండు వారాల వరకు పెంచుకునే అనుమతిచ్చారు. మరి దేవర డే 1 ఎంతమేర ఓపెనింగ్ రాబడుతుందో చూడాలి.