నాని దసరా సినిమా ట్రైలర్ ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అనే విషయాన్ని ఈ రోజు కొత్త పోస్టర్ తో ట్రైలర్ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు నిర్మాతలు. కాగా మార్చి 14న విడుదల కానున్న అన్ని భాషల్లో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఈ పోస్టర్ అద్భుతంగా, అదిరిపోయే విధంగా ఉండటంతో ప్రేక్షకుల నుంచి కూడా అంతే మంచి స్పందన వచ్చింది. మంచి ప్రమోషనల్ కంటెంట్ తో ఈ సినిమా రోజురోజుకు హైప్ పెంచుతోంది.
ట్రైలర్ విడుదల ఎక్కడ చేసేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ దసరా ట్రైలర్ ను జాతీయ స్థాయిలో ఒకేసారి పలు భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. లభ్యత, ఏర్పాట్లను బట్టి ఉత్తర ప్రదేశ్, లక్నోలో ట్రైలర్ ను విడుదల చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. దసరా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో మాస్ ఉత్సాహాన్ని నింపుతామని నిర్మాతలు హామీ ఇచ్చారు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, సత్యన్ సూర్యన్ ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందించారు. నవీన్ నూలి ఎడిటర్ గా, అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్ గా, విజయ్ చాగంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత.
నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వహాబ్, సాయి కుమార్, రాజశేఖర్ అనింగి తదితరులు నటించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ , మలయాళ భాషల్లో మార్చి 30న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తెలంగాణలోని రామగుండం గోదావరిఖని సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.