నాని తాజా చిత్రం దసరా విడుదలకు ముందే విపరీతమైన బజ్, ఎక్సయిట్ మెంట్ క్రియేట్ చేసింది. కాగా ఈ జోరు ఇలాగే కొనసాగుతుందని చిత్ర బృందం భావిస్తోంది. ఇటీవలే నిర్మాతలు విడుదల చేసిన ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ సినిమాకి బాగా పని చేశాయి. అందుకే ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా నాని మార్కెట్ కి రికార్డ్ స్థాయి ధరలకు పలకడంతో ట్రేడ్ సర్కిల్ ఈ ప్రాజెక్ట్ పై చాలా ఆసక్తిని చూపించింది.
ప్రతి ఏరియాలో దిల్ రాజు అధిక ధరలను కోట్ చేస్తున్నా సినిమాకి డిమాండ్ మాత్రం బాగానే ఉంది. సీడెడ్ ఏరియా ద్వారా నిర్మాతలకు 6.5 కోట్లు (6.3 కోట్లు + 20 లక్షల ఖర్చులు) వచ్చాయి. సీడెడ్ హక్కులను లక్ష్మీ కాంత్ కొనుగోలు చేయగా, భారీ తేడాతో ఇది రికార్డ్ బిజినెస్ అని చెప్పవచ్చు. మిగతా ఏరియాల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉండటంతో ఈ సినిమా యొక్క బాక్సాఫీస్ కలెక్షన్ల పై అంచనాలు భారీగా ఉన్నాయి.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ దసరాలో కీర్తి సురేష్, సాయి కుమార్, షైన్ టామ్ చాకో తదితరులు నటించారు. తెలంగాణలోని గోదావరిఖని సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆ నేపథ్యం కూడా సినిమాకి ఒక కొత్త కోణాన్ని తీసుకు వచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2023 మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.