Homeసినిమా వార్తలుDasara: థియేట్రికల్ రైట్స్ అమ్మడం ద్వారా కోట్ల రూపాయలు పోగొట్టుకున్న దసరా నిర్మాత

Dasara: థియేట్రికల్ రైట్స్ అమ్మడం ద్వారా కోట్ల రూపాయలు పోగొట్టుకున్న దసరా నిర్మాత

- Advertisement -

హీరో నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ ప్రాజెక్ట్ దసరా. ఈ సినిమా బడ్జెట్ 65 కోట్లకు పైగా ఉంటుందని వినికిడి. అయితే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా ఆ మొత్తాన్ని రికవరీ చేసిన నిర్మాత.. తద్వారా దాదాపు 10 కోట్ల లాభాలు ఆర్జించారు.

ఆ రకంగా తెలుగు రాష్ట్రాల దసరా సినిమా థియేట్రికల్ రైట్స్ ను నిర్మాత 23 కోట్లకు ఒక బయ్యర్ కు అమ్మగా, ఆ బయ్యర్ అవే హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు 28 కోట్లకు అమ్మినట్లు సమాచారం. ఇప్పుడు ఈ సినిమాకు 35 కోట్ల వరకు భారీ ఆఫర్లు వస్తున్నాయి. బిజినెస్ లో వచ్చిన మార్పును గమనిస్తే నిర్మాత ఈ సినిమాను ముందుగానే 23 కోట్లకు అమ్మకపోయి ఉంటే ఇప్పుడు నిర్మాతకు తెలుగు రాష్ట్రాల నుంచి ఖచ్చితంగా 35 కోట్లు వచ్చేవి అని లోగడ వర్గాలు అనుకుంటున్నాయి.

బహుశా ఆ సమయంలో దసరాకు ఇంత క్రేజ్ వస్తుందని నిర్మాత సుధాకర్ చెరుకూరి ఊహించి ఉండకపోవచ్చు. కానీ తెలిసో తెలియకో ఆయన తన తప్పిదానికి మంచి మూల్యం చెల్లించుకున్నారు అనే చెప్పాలి.

READ  Dasara: దసరా సినిమా పై వస్తున్న పుకార్లను ఖండించిన హీరో నాని

నాని తాజా చిత్రం దసరా టీజర్ ను సోమవారం ప్రదర్శించగా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. శ్రీకాంత్ ఓదెల అనే నూతన దర్శకుడు ఈ చిత్రానికి దర్శకుడు. ఇదిలా ఉంటే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు దక్కించుకున్నట్లు వార్తలు ఇటీవలే వచ్చాయి.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వహాబ్, సాయి కుమార్, షైన్ టామ్ చాకో, రాజశేఖర్ అనింగి తదితరులు నటించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ , మలయాళ భాషల్లో మార్చి 30న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణలోని రామగుండం గోదావరిఖని సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.

Follow on Google News Follow on Whatsapp

READ  Samantha: సంక్రాంతి తర్వాత షూటింగ్ సెట్లో అడుగు పెట్టనున్న సమంత


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories