నాని దసరా సినిమా విడుదలకు ముందే నిర్మాతలకు లాభాలను తెచ్చిపెడుతుంది. అంతర్గత వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా బడ్జెట్ (65 కోట్లు) అనుకున్న బడ్జెట్ (35 కోట్లు) కంటే దాదాపు రెట్టింపు అయినప్పటికీ నిర్మాతకు లాభాలు వచ్చాయని తెలుస్తోంది.
నాచురల్ స్టార్ నాని తన తాజా చిత్రం దసరాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. గత వారం ఈ సినిమా టీజర్ ను విడుదల చేయగా, ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన వచ్చింది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు.
ఆ రకంగా దసరా సినిమా విడుదలకు ముందే లాభాలను ఆర్జించిందని లేటెస్ట్ టాక్ ఆఫ్ ది టౌన్. ఇప్పటికే నిర్మాత రూ.15 కోట్లు రాబట్టినట్లు సమాచారం. దాదాపు 65 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను 33 కోట్లకు.. నాన్ థియేట్రికల్ రైట్స్ ను 47 కోట్లకు అమ్మారని తెలుస్తోంది.
కాగా ఈ సినిమా యెక్క తెలుగు రాష్ట్రాల హక్కులను దిల్ రాజుకు అమ్మగా ఇప్పుడు దిల్ రాజు తెలుగు రాష్ట్రాల బిజినెస్ 35 కోట్లకు చేస్తున్నారు. దసరాకు ఉన్న క్రేజ్, హైప్ చూస్తుంటే ఈ మొత్తం ఈజీగా రికవరీ అవుతుంది అనే అనిపిస్తుంది.
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సాయికుమార్, షైన్ టామ్ చాకో, సముద్రఖని, జరీనా వహాబ్ కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చిన ఈ పాన్ ఇండియా సినిమాకి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించారు. 2023 మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.