రెండు వారాల క్రితం విడుదలైన నాని దసరా పాజిటివ్ రివ్యూలు, మంచి టాక్ తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా ఏరియాల వారీగా కనబర్చిన పెర్ఫార్మెన్స్ అందరినీ కాస్త ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పాలి.
టీజర్స్, ట్రైలర్స్, పోస్టర్స్, పాటల అన్నీ బాగా వర్కవుట్ అయ్యి ఈ సినిమాకి భారీ బజ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా ఖచ్చితంగా మాస్ ఫీస్ట్ అవుతుందని, మాస్ సెంటర్స్ లో అద్భుతాలు చేస్తుందని అందరూ భావించారు కానీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఈ సినిమా మాస్ సెంటర్స్ లో మామూలు ప్రదర్శన కనబరిచి ఎ, బి సెంటర్స్ లో మాత్రం అద్భుతంగా ప్రదర్శితమైంది.
దసరా సినిమా వల్ల ఎ, బి సెంటర్స్, ఓవర్సీస్ భారీ లాభాలను అందుకోగా, సి అండ్ డి సెంటర్స్ మాత్రం బ్రేక్ ఈవెన్ మార్కును అందుకోవడంలో విఫలం కావడం ప్రేక్షకులను, ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఏదేమైనా ఈ చిత్రం ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ మార్క్ ను సాధించి నాని కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ ను క్రాస్ చేయడంతో పాటు యుఎస్ లో 2 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసిన మొట్టమొదటి నాని చిత్రంగా నిలిచింది.
దసరా సినిమాలో కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టిల మంచి సపోర్ట్ తో నాని సూపర్బ్ పెర్ఫార్మెన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గ్రామీణ తెలంగాణను సహజంగా చిత్రీకరించడంతో పాటు ఎమోషనల్, యాక్షన్ సీక్వెన్స్ లను చక్కగా తెరకెక్కించగా అవి సినిమాకు హైలైట్ గా నిలిచాయి.
సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి, సాయికుమార్, సముద్రఖని, షైన్ టామ్ చాకో, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. సత్యన్ సూర్యన్ ఐఎస్సీ సినిమాటోగ్రఫీ అందించారు. నవీన్ నూలి ఎడిటర్ గా, అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్ గా, విజయ్ చాగంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.