Homeసినిమా వార్తలుTelevision: ఆగస్ట్ 21న జీ తెలుగులో డాన్స్ ఇండియా డాన్స్ భారీ లాంచ్ ఈవెంట్

Television: ఆగస్ట్ 21న జీ తెలుగులో డాన్స్ ఇండియా డాన్స్ భారీ లాంచ్ ఈవెంట్

- Advertisement -

జీ తెలుగు ఛానల్ ప్రారంభం అయిన నాటి నుండి అనేక రకాల రియాలిటీ షోలతో ప్రేక్షకులకు అలరించింది. కాగా ఇప్పుడు, తెలుగు ప్రేక్షకులకు తొలిసారిగా డాన్స్ ఇండియా డ్యాన్స్ – షోను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రోమో వచ్చినప్పటి నుండి, తెలుగు ప్రేక్షకులు ఈ షోపై అసక్తి చూపుతున్నారు. అంతే కాకుండా ఈ డాన్స్ షోకు సంభందించిన ప్రోమోలు కూడా సందడి చేస్తున్నాయి.

ఈ డ్యాన్స్ రియాలిటీ షో కోసం ప్రేక్షకులలో అసక్తి తారాస్థాయిలో ఉంది. జీ ఛానల్ ద్వారా ప్రారంభించబడిన ఈ ప్రముఖ రియాలిటీ షో ఆగస్ట్ 21న భారీ స్థాయిలో అట్టహాసంగా లాంచ్ ఈవెంట్ కి సిద్ధంగా ఉంది. ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారమయ్యే డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ ప్రోగ్రాం తెలుగు ప్రేక్షకులను అలరించడమే కాకుండా, ప్రతిభావంతులైన వర్ధమాన నృత్యకారులకు తమ ప్రతిభను ప్రదర్శించడానికి సరైన వేదికను అందిస్తుంది.

తెలుగు టెలివిజన్ పరిశ్రమలోనే అతి పెద్ద డ్యాన్స్ రియాలిటీ షోగా రూపొందిస్తున్న “డాన్స్ ఇండియా డ్యాన్స్ తెలుగు” ప్రోగ్రాం కు నటి సంగీత, నృత్య దర్శకుడు బాబా భాస్కర్ మరియు తెలుగు నటి అయినా తమిళనాట మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఆనంది న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తుండగా, యాంకర్లుగా అకుల్ బాలాజీ మరియు బిగ్ బాస్ ఫేం రోహిణి అలరించనున్నారు. అత్యంత ఘనంగా “డాన్స్ ఇండియా డాన్స్ తెలుగు” లాంచ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అంతే కాక ఈ ఈవెంట్ లో బాబా భాస్కర్ మరియు రోహిణిల ప్రత్యేక నృత్య ప్రదర్శన అద్భుతంగా ఉంటుందట. దర్శకుడు కళ్యాణ్‌జీ గోగన, సంగీత దర్శకుడు సాయి కార్తీక్‌తో కలిసి నటుడు ఆది సాయి కుమార్ కూడా వారి తదుపరి చిత్రం ‘తీస్ మార్ ఖాన్’ ప్రచార నిమిత్తం ఈ లాంచ్‌లో పాల్గొననున్నారు.

READ  కొత్త లుక్ లో ప్రేక్షకులకు షాక్ ఇచ్చిన రష్మిక

డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ – తెలుగుతో, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన వర్ధమాన కళాకారులకి వారి నృత్య నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఒక చక్కని అవకాశం ఇస్తుంది. అయితే ఎంత మంది పోటీ పడ్డా చివరికి విజేతలుగా నిలిచేది ఒక్కరే. మరి ఈ డాన్స్ కాంపిటీషన్ లో ఎవరు గెలుస్తారో లేక ఎవరు సరికొత్త స్టార్ గా అవతరిస్తారో చూడాలి. ఈ రియాలిటీ షో యొక్క భారీ లాంచ్ ఈవెంట్ కంటే ముందు ప్రేక్షకులకు మరో కానుక అందించనున్నారు జీ తెలుగు ఛానల్ వారు.

ఈ ఏడాదిలోనే అతి పెద్ద హిట్ అయిన కేజీఫ్-2 వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ను ప్రదర్శించబోతోంది. దేశ వ్యాప్తంగా కోట్లాది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ చిత్రం ఆగస్టు 21వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుంది.

Follow on Google News Follow on Whatsapp

READ  దిల్ రాజు కావాలనే కార్తీకేయ-2 ని టార్గెట్ చేస్తున్నారా?


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories