నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పై బాలకృష్ణ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన టైటిల్ టీజర్ కి అందరి నుండి మంచి రెస్సాన్స్ లభించింది.
విషయం ఏమిటంటే, తమ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ ని డిసెంబర్ 14న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన మేకర్స్, ఆ సాంగ్ యొక్క ప్రోమో నేడు ఉదయం 10 గం. 8 ని. లకు రిలీజ్ అవుతుందని తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా తెలిపారు. 1890ల కాలం నాటి దోపిడీదారుడు డాకు సింగ్ యొక్క జీవిత కథ ఆధారంగా ఈ మూవీ గ్రాండ్ గా రూపొందుతున్నట్లు టాక్.
అయితే అతడు దోపిడీ దొంగ అయినప్పటికీ ఎందరో పేదసాదలను తనవంతుగా ఆడుకుకి వారి పాలిట దేవుడిగా నిలిచిన డాకు సింగ్ కి గుడి కూడా ఉంది. మొత్తంగా అయితే అతడి పవర్ఫుల్ పాత్రలో బాలకృష్ణ ఈ మూవీలో తన అత్యద్భుత నటనతో అందరినీ ఆకట్టుకోవడం ఖాయం అంటోంది టీమ్. కాగా ఈ మూవీ జనవరి 12న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.