Homeసమీక్షలుDaaku Maharaaj Movie Review: Balakrishna’s Feast 'డాకు మహారాజ్' రివ్యూ : బాలకృష్ణ మాస్...

Daaku Maharaaj Movie Review: Balakrishna’s Feast ‘డాకు మహారాజ్’ రివ్యూ : బాలకృష్ణ మాస్ జాతర

- Advertisement -

సినిమా పేరు: డాకు మహారాజ్
రేటింగ్: 2.75/5
తారాగణం: బాలకృష్ణ, బాబీ డియోల్, శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్, ఊర్వశి రౌతేలా తదితరులు
దర్శకుడు: బాబీ
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
విడుదల తేదీ: 12 జనవరి 2025

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో సితార ఎంటెర్టైన్మెట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ గ్రాండ్ లెవెల్లో నిర్మించిన మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ డాకు మహారాజ్.

ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీ మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు కలిగి ఉంది. ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో చాందిని చౌదరి, ఊర్వశి రౌటేలా, శ్రద్ధ శ్రీనాధ్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. ఇక నేడు మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో పూర్తి రివ్యూ లో చూసి తెలుసుకుందాం.

కథ :

ఒక సివిల్ ఇంజనీర్ అయిన సీతారాం అనే వ్యక్తి జీవితంలో జరిగే కొన్ని అనుకోని ఘటనలు, అనంతరం అతడు నానాజీ, డాకు మహారాజ్ గా ఎలా మారాడు అనేది తెలిపే కథగా ముందుకు సాగుతుంది.

పెర్ఫార్మన్స్ లు :

ముందుగా డాకు మహారాజ్ గా అలానే నానాజీ, సీతారాం ఇలా మూడు పాత్రల్లో కూడా ఆకట్టుకునే నటనతో మరొక్కసారి ఆడియన్స్ ని మెప్పించారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఇక డాకు మహారాజ్ గా ఆయన పవర్ఫుల్ పెర్ఫార్మన్స్, పలికిన డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఆడియన్స్ తో పాటు ఫ్యాన్స్ ని కూడా విశేషంగా ఆకట్టుకుంటాయి.

READ  Pushpa 2 Review Allu Arjun did Best but Sukumar Struggles 'పుష్ప - 2' రివ్యూ : అల్లు అర్జున్ బెస్ట్ కానీ సుకుమార్ తడబడ్డాడు

హీరోయిన్ గా నటించిన ప్రగ్యా జైస్వా, ఇతర పాత్రల్లో నటించిన శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి అందరూ కూడా తమ పాత్రల యొక్క పరిధి మేరకు ఆకట్టుకున్నారు. నటుడు బాబీ డియోల్ పాత్ర బాగుంది. అతడు కూడా ఆకట్టుకున్నాడు. సచిన్ ఖేడేకర్, మకరంద్ ల నటన కూడా అలరిస్తుంది.

విశ్లేషణ :

ఇక డాకు మహారాజ్ మూవీ కథనం మొదటి నుండి కూడా పవర్ఫుల్ అంశాలతో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా స్టైలిష్ యాక్షన్ ఎంగేజింగ్ అంశాలతో నడుస్తూ పవర్ఫుల్ ఇంటర్వ్యూల్ ఎపిసోడ్ తో మరింతగా సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ ఏర్పరుస్తుంది.

బాలకృష్ణ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ ఈ మూవీకి ప్రధాన హైలైట్. సెకండ్ హాఫ్ లో వచ్చే డాకు మహారాజ్ పాత్ర చిన్నదే అయినప్పటికీ కూడా అది ఆడియన్స్ ఓ మంచి ఇంపాక్ట్ ఏర్పరుస్తుంది. రెగ్యులర్ ఫార్మాట్ లో సాగినప్పటికీ కూడా దానిని ఫ్యాన్స్ కి ఆడియన్స్ కి కనెక్ట్ చేసేలా దర్శకుడు బాబీ చిత్రీకరించారు.

పాజిటివ్స్:

  • బాలకృష్ణ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్
  • ఎలివేషన్లు మరియు యాక్షన్ బ్లాక్స్
  • స్టైలిష్ ఫస్ట్ హాఫ్
  • సినిమాటోగ్రఫీ
  • థమన్ బిజీఎం
READ  Vikkatakavi Web Series Review A Decent and Neat Detective Series 'వికటకవి' వెబ్ సిరీస్ రివ్యూ : ఆకట్టుకునే డీసెంట్ డిటెక్టివ్ సిరీస్

నెగటివ్స్:

  • బలహీనమైన విలన్ బ్యాక్‌డ్రాప్
  • మాములుగా సాగె ఊహించదగిన రెండవ హాఫ్
  • రిపీటెడ్ సన్నివేశాలు

తీర్పు :

మొత్తంగా బాబీ దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ చేసిన డాకు మహారాజ్ మూవీ నందమూరి ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు యాక్షన్ కమర్షియల్ సినిమాలు చూసే ఆడియన్స్ ని మెప్పిస్తుంది. పాత కథే అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఫస్ట్ సీన్ నుండి చివరి వరకు గ్రాండియర్ గా దర్శకుడు బాబీ ఈమూవీని తీశారు. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, బాలకృష్ణ పెర్ఫార్మన్స్, విజువల్స్ దీనికి ప్లస్ పాయింట్స్ గా చెప్పవచ్చు. మొత్తంగా ఈ సంక్రాంతికి మంచి ఎమోషనల్ యాక్షన్ మూవీ చూడాలనుకునే వారికి ఇది మంచి ఛాయిస్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories