యువ నటీనటులు హర్ష్ రోషన్, శ్రీదేవి అప్పల ప్రధాన పాత్రలు పోషించిన లేటెస్ట్ కోర్ట్ యాక్షన్ డ్రామా మూవీ కోర్ట్. ఈ మూవీని యువ నిర్మాత ప్రశాంతి తిపిర్నేనితో కలిసి నాచురల్ స్టార్ నాని గ్రాండ్ గా నిర్మించారు. ఇక ఈ మూవీలో ప్రియదర్శి, సాయి కుమార్, హర్ష వర్ధన్, రోహిణి, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
కాగా ఇటీవల మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈమూవీ ప్రీమియర్స్ నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుని ప్రస్తుతం థియేటర్స్ లో బాగా కలెక్షన్ తో కొనసాగుతోంది. ముఖ్యంగా కోర్ట్ డ్రామా యాక్షన్ సీన్స్ తో పాటు ఆకట్టుకునే కథ కథనాలతో రూపొందిన ఈమూవీ పై పలువురు ప్రేక్షకులు ప్రసంశలు కురిపిస్తున్నారు.
ముఖ్యంగా ఈ మూవీలో నటుడు శివాజీ చేసిన మంగపతి పాత్రకు మరింత మంచి రెస్పాన్స్ లభిస్తోంది. మరోవైపు యుఎస్ఏ లో కూడా బాగా కలెక్షన్ రాబడుతుండడం విశేషం. ఇప్పటికే అక్కడ ఈమూవీ 805 కె డాలర్స్ ని రాబట్టింది. మరి కోర్ట్ మూవీ యొక్క ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం.
కోర్ట్ : స్టేట్ vs. ఎ నోబడీ ఫస్ట్ వీక్ గ్రాస్:
ప్రీమియర్స్ + డే 1–8: 10 కోట్లు
2వ రోజు – 7.80 కోట్లు
3వ రోజు – 8.50 కోట్లు
4వ రోజు – 4:50 కోట్లు
5వ రోజు – 4.65 కోట్లు
6వ రోజు – 3.3 కోట్లు
7వ రోజు – 2.75 కోట్లు
ఇక మొత్తంగా ఇప్పటివరకు ఈమూవీ వరల్డ్ వైడ్ గా టోటల్ రూ. 40 కోట్ల గ్రాస్ ని అనగా షేర్ ప్రకారం రూ. 20 కోట్లని రాబట్టింది. అలానే త్వరలో యుఎస్ఏ లో 1 మిలియన్ డాలర్స్ ని అందుకోవడం కూడా ఖాయంగా కనపడుతోంది.