Homeసమీక్షలుకూలీ మూవీ రివ్యూ : రెగ్యులర్ గా సాగె రివెంజ్ డ్రామా మూవీ 

కూలీ మూవీ రివ్యూ : రెగ్యులర్ గా సాగె రివెంజ్ డ్రామా మూవీ 

- Advertisement -

సినిమా పేరు: కూలీ

రేటింగ్: 2.5/5

తారాగణం: రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, అమీర్ ఖాన్ మరియు ఇతరులు

దర్శకుడు: లోకేష్ కనగరాజ్

నిర్మాత: సన్ పిక్చర్స్

విడుదల తేదీ: 14 ఆగస్టు 2025

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నాగార్జున నెగటివ్ పాత్రలో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కూలీ. ఈ మూవీని సన్ పిక్చర్స్ సంస్థ పై కళానిధి మారన్ గ్రాండ్ గా నిర్మించగా కీలక పాత్రల్లో అమీర్ ఖాన్, శృతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్ తదితరులు నటించారు. అనిరుద్ సంగీతం అందించిన ఈ మూవీ పై మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ యొక్క పూర్తి రివ్యూ ఇప్పుడు చూద్దాం. 

కథ

దేవా (రజినీకాంత్) అనే వయసైన వ్యక్తి తన మ్యాన్షన్ లో ఒంటరిగా జీవిస్తూ ఉంటాడు. అయితే అతడు స్నేహితుడు రాజశేఖర్ (సత్యరాజ్) అనుకోకుండా ఊహించనివిధంగా చనిపోవడం జరుగుతుంది. అయితే ఆ తరువాత రాజశేఖర్ కూతురు ప్రీతి చుట్టూ కొన్ని ప్రమాదం పొంచి ఉండడం, ఆ తరువాత కథ సైమన్ చుట్టూ చేరడం, ఆపైన దేవా యొక్క గతం, అక్కడి నుండి స్టోరీ ఏ విధంగా సాగింది అనేది మొత్తం కూడా మనం మూవీలో చూడాల్సిందే. 

నటీనటుల పెర్ఫార్మన్స్ :

ముఖ్యంగా ఈ మూవీలో మరొక్కసారి తన అద్భుత పెర్ఫార్మన్స్ తో సూపర్ స్టార్ రజినీకాంత్ అదరగొట్టారు. లేటెస్ట్ గా 50 ఏళ్ళ సినీ కెరీర్ పూర్తి చేసుకున్న రజిని మార్క్ కొన్ని స్టైలిష్ డైలాగ్స్, మ్యానరిజమ్స్ ఆకట్టుకుంటాయి.

ఇక తొలిసారిగా కెరీర్ లో నెగటివ్ పాత్ర చేసిన కింగ్ అక్కినేని నాగార్జున సైమన్ గా ఆకట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్ లో నాగార్జున పాత్ర ఆకట్టుకున్నప్పటికీ చివర్లో రజిని, నాగ్ ల మధ్య వచ్చే ఫైట్ సీన్స్ ని మరింత ఇంట్రెస్టింగ్ గా రాసుకోవాల్సింది.

తన పాత్ర యొక్క పరిధి మేరకు శృతి హాసన్ ఆకట్టుకుంది. అయితే ఉపేంద్ర, అమీర్ ఖాన్ ల పాత్రలు అంత గొప్పగా ఏమి లేవు. ఇక మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ తన పాత్రలో ఒదిగిపోయి సహజ నటన కనబరిచి అందరినీ అలరించాడు. సత్యరాజ్ తో పాటు రుచితా రామ్ కూడా అలరించే పెర్ఫార్మన్స్ కనబరిచారు. 

READ  వార్ - 2 మూవీ రివ్యూ : ఫెయిల్ అయిన మిషన్ 

విశ్లేషణ

మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ కూలీ మూవీని పోర్ట్ సీన్స్ ద్వారా ప్రారంభించారు. అక్కడ పని చేసే కూలీని అతడి జీవితాన్ని చూపిస్తూ మూవీ ఆరంభం అవుతుంది. ఆ తరువాత నెగటివ్ పాత్ర చేసిన సైమన్ నుండి ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఇంటర్వెల్ వరకు ఆసక్తికరంగానే సాగుతుంది.

దేవా ఇంట్రడక్షన్ తో పాటు ప్రీతీతో ఉండే బంధం, హాస్టల్ లో ఫైట్ వంటి సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా అలరిస్తుంది. అయితే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సైమన్ పాత్ర సెకండ్ హాఫ్ లో మెల్లగా ఆసక్తిని కోల్పోతుంది. దేవాతో అతడికి ఏంటి సంబంధం అనే సీన్స్ పర్వాలేదనిపించినా మొత్తంగా అంత ఇంట్రెస్టింగ్ గా ఉండవు.

ఇక సౌబిన్, శృతి హాసన్ ల సీన్స్ కొంత సాగదీసినట్లు అనిపిస్తాయి. ఇక విలన్స్ మధ్య ఉండే లింక్స్ కి సంబందించిన సీన్స్ కూడా అంతగా ఆకట్టుకోవు. అయితే కొక్కి థీమ్ ఫైట్ లో రజిని మార్క్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో పాటు ఉపేంద్ర, అమీర్ ఖాన్ ల సీన్స్ కొంత హై అందిస్తాయి. 

READ  'తమ్ముడు' మూవీ రివ్యూ : టార్గెట్ మిస్ అయింది

ప్లస్ పాయింట్స్

  • సూపర్ స్టార్ రజనీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్
  • కొన్ని ఎలివేటెడ్ సన్నివేశాలు / ఫైట్స్
  • అనిరుధ్ సంగీతం

మైనస్ పాయింట్స్

  • చాలా సులభమైన కథ
  • సైమన్ పాత్రలో నాగార్జునను అంత బాగా ఉపయోగించుకోలేదు
  • క్యామియోలకు మెరుగైన సెటప్ అవసరం
  • ఆసక్తిని రేకెత్తించలేని కథనం

తీర్పు

మొత్తంగా తొలిసారిగా సూపర్ స్టార్ రజినీకాంత్ తో యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తీసిన లేటెస్ట్ మాస్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ కూలీ ఒక సాధారణ రివెంజ్ డ్రామా మూవీ అని చెప్పాలి. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటు నాగార్జున, సౌబిన్ ల యాక్టింగ్, కొన్ని ఎలివేషన్, థ్రిల్లింగ్ సీన్స్, అనిరుద్ సంగీతం వంటివి ప్లస్ పాయింట్స్ గా చెప్పవచ్చు. అయితే పూర్తి సాదాసీదాగా సాగె స్టోరీ ఉన్న ఈ మూవీని పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా థియేటర్ కి వెళ్లి చూస్తే నచ్చుతుంది. 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories