Homeబాక్సాఫీస్ వార్తలుBox-Office: కోబ్రాతో కమ్ బ్యాక్ ఇవ్వనున్న చియాన్ విక్రమ్

Box-Office: కోబ్రాతో కమ్ బ్యాక్ ఇవ్వనున్న చియాన్ విక్రమ్

- Advertisement -

తమిళ స్టార్ హీరో విక్రమ్ నటించిన తాజా సినిమా ‘కోబ్రా’. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి అజయ్ జ్ఞానముత్తు దర్శకుడు. అరుళ్ నిధితో ‘డీమోంటీ కాలనీ’.. నయనతార, అధర్వ, అనురాగ్ కశ్యప్ కాంబినేషన్లో ‘ఇమైక్కా నోడిగల్ ‘ వంటి యాక్షన్ థ్రిల్లర్ లని అందించిన అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన మూడవ సినిమా ‘కోబ్రా’.

చియాన్ విక్రమ్ గత కొంత కాలంగా స్టార్ హీరోగా తన ఫామ్ ని కోల్పోయారు. ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద చాలా వరకు మంచి ఓపెనింగ్స్ ను సాధించలేకపోయాయి, అయితే కోబ్రా సినిమా మాత్రం ప్రేక్షకులలో చాలా మంచి బజ్‌ను సృష్టించింది, తమిళ నాట ఈ చిత్రానికి చక్కని అడ్వాన్స్ బుకింగ్‌లు నమోదయ్యాయి. కాగా ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తమిళ బాక్స్ ఆఫీస్ వద్ద తొలి రోజు రెండంకెల సంఖ్యలతో ప్రారంభం కానుందని అంచనా. ఈ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద విక్రమ్ తన స్టార్డం ను తిరిగి పొందుతారని అందరూ భావిస్తున్నారు.

‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. కాగా మాజీ ఇండియన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విలన్ గా నటించడం విశేషం. ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్టు 11న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ రిలీజ్ డేట్ ని మార్చేసి కొత్త రిలీజ్ డేట్ అంటే ఆగస్ట్ 31న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు చిత్ర బృందం ప్రకటించారు.

READ  ప్రొడ్యూసర్స్ గిల్డ్ పై నిర్మాత బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు

తమిళంతో పాటు తెలుగు, మలయాళ భాషల్లో కూడా విడుదల కానున్న ఈ సినిమాలో మియాజార్జ్, పద్మప్రియ, మృనాళిని రవి, ఆనంద్ రాజ్, కె.ఎస్. రవికుమార్, రోబో శంకర్, బాబు ఆంటోనీ తదితరులు నటించారు.

రష్యా నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో హీరో విక్రమ్ దాదాపు 20 విభిన్నమైన గెటప్ లలో కనిపించనున్నారని సమాచారం. ఇక ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ట్రైలర్ లు కూడా ఆకట్టుకున్నాయి. విక్రమ్ చివరిగా నటించిన మహాన్ చిత్రం నేరుగా ఓటిటిలో విడుదలయింది. ఆ చిత్రంలో విక్రమ్ తనయుడు అయిన ధ్రువ్ విక్రమ్ కూడా నటించారు. తండ్రీ కొడుకులు పొటీ పడి నటించిన తీరుకు గొప్ప ప్రశంసలే దక్కాయి.

అయితే బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించాల్సిన నేపథ్యంలో విక్రమ్ తిరిగి తన ఫార్మ్ ను అందుకుంటారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పలు రకాల గెటప్పులు అంటూ హంగామా చేసినా.. సరైన కంటెంట్ ఉంటేనే సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అయితే మొన్నటి వరకూ కాస్త నీలినీడలు కమ్ముకున్నట్లు ఉన్న కోబ్రా చిత్రం ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయిన తరువాత ఊపు అందుకున్నట్లు కనిపిస్తుంది. మరి భారీ హిట్ కొట్టలన్న రానున్న విక్రమ్ ఆశను ప్రేక్షకులు నెరవేరుస్తారా లేదా అన్నది తెలియాలంటే ఇంకొక్క రోజు వేచి చూడాల్సిందే.

Follow on Google News Follow on Whatsapp

READ  త్వరలోనే మొదలు కానున్న దృశ్యం-3


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories