ఆచార్య వంటి భారీ పరాజయం తర్వాత బాక్సాఫీసు వద్ద తనదైన శైలిలో ఒక బ్లాక్ బస్టర్ సాధించాలనే మెగాస్టార్ చిరంజీవి ఆశలు గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ప్రదర్శన వల్ల నీరుగారి పోయాయి. రాజకీయ డ్రామాకు యాక్షన్ ఎంటర్టైనర్ టచ్ ఇచ్చి తెరకెక్కించిన ఈ సినిమా పండుగ సీజన్‌ను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది.
కాగా తొలి వారాంతం కాస్త పరవాలేదు అనిపించినా ఆ తరువాత సినిమా రన్ చాలా నీరసంగా సాగింది. నిజానికి గాడ్ ఫాదర్ సినిమా రన్ ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురి చేసింది.
చాలా ఏరియాల్లో, ఖైదీ నంబర్ 150, మరియు సైరా నరసింహ రెడ్డి వంటి గత చిరంజీవి సినిమాల మొదటి రోజు షేర్ కంటే గాడ్ ఫాదర్ సినిమా రెండు వారాల షేర్ తక్కువగా ఉండటం గమనార్హం. ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గాడ్ ఫాదర్ సినిమా దాని మలయాళ మాతృక అయిన మోహన్ లాల్ లూసిఫర్ కంటే కూడా మొత్తంగా తక్కువ వసూళ్లు కలెక్ట్ చేయడమే. ఈ విషయం పై ఇతర హీరోల అభిమానులు మెగా అభిమానులను ట్రోల్ కూడా చేశారు.
ఈ చిత్రంలో సత్యదేవ్ మరియు నయనతార కీలక పాత్రలు పోషించారు. కాగా సినిమాకి చాలా సానుకూల సమీక్షలు లభించాయి. ముఖ్యంగా చిరంజీవి, సత్యదేవ్‌ల నటనను ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా మెచ్చుకున్నారు. ఇంతకు ముందే నటుడుగా మంచి పేరు ఉన్న సత్యదేవ్, ఈ సినిమాలో ప్రతినాయక పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఇక తాజాగా గాడ్ ఫాదర్ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. కాగా ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా నవంబర్ 19న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ప్రమోషన్ల సమయంలో చాలా సార్లు చెప్పినట్లుగా, చిరంజీవి గాడ్ ఫాదర్ అనేది మోహన్ లాల్ యొక్క మలయాళ బ్లాక్ బస్టర్ ‘లూసిఫర్’ సినిమాకు మరింత వాణిజ్యీకరించబడిన సినిమా.