మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ పాదర్ సినిమా మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన గాడ్ ఫాదర్ సినిమా చుట్టూ చక్కని హైప్ ఏర్పడింది. మలయాళం సూపర్ హిట్ సినిమా లూసీఫర్ కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉండటంతో అన్ని విధాలుగా బిజినెస్ భారీగా ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
మలయాళంలో ప్రధాన పాత్రను పోషించగా ఆ పాత్రలో ఇక్కడ చిరంజీవి కనిపిస్తారు. కాగా మాతృకకి దర్శకత్వం వహించిన పృథ్వీరాజ్ అందులో ఒక ముఖ్య అతిథి పాత్రలో నటించారు. విశేషం ఏమిటంటే తెలుగులో ఆ పాత్రను బాలివుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ చేస్తున్నారు.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు పెద్ద స్టార్స్ నటిస్తున్న సినిమా కావటంతో గాడ్ ఫాదర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా అక్టోబర్ 5 న విడుదల కానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను సరైన విధంగా నడిపించట్లేదని మెగా అభిమానులు భావిస్తున్నారు.
ఈ సినిమా మొదటి సింగిల్ గత వారం విడుదల కావాల్సి ఉండగా, ఇప్పటికీ ఆ లిరికల్ విడియో రిలీజ్ కాలేదు. ఈ విషయం వల్ల సినిమాకి క్రేజ్ తగ్గుతుందేమో అని అభిమానులు కాస్త ఆందోళన చెందిన మాట వాస్తవం. అయితే వారికి అలాంటి భయాలేవీ అక్కర్లేదని చెప్పడానికి ఒక వార్త వచ్చింది.
ఈ సినిమా పై ఉన్న విపరీతమైన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని బయ్యర్లు ఫ్యాన్సీ మొత్తాలను ఆఫర్ చేసి రైట్స్‌ను సొంతం చేసుకుంటున్నారు. వాస్తవానికి, ఈ సినిమా థియేట్రికల్ వ్యాపారం అన్ని ఏరియాలలో ఇప్పటికే దాదాపు ముగిసింది. ఇక డిజిటల్ హక్కులు కూడా పెద్ద మొత్తాలకు అమ్ముడయ్యాయని తాజా సమాచారం.
ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 57 కోట్లు వెచ్చించింది. ఈ ఒప్పందంలో ఈ సినిమా తెలుగు మరియు హిందీ OTT హక్కులు ఉన్నాయట. తెలుగు సినిమాల వరకు దసరా అతిపెద్ద సీజన్‌లలో ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా ఇద్దరు మెగాస్టార్‌లను తెరపై చూడటానికి అభిమానులు. చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి మోహన్ రాజా చిత్రానికి దర్శకత్వం వహించారు.