గాడ్ ఫాదర్ కలెక్షన్ల ఫేక్ నంబర్ల వల్ల చిరంజీవి, రామ్ చరణ్ లకు సోషల్ మీడియాలో ఎదురుదెబ్బ తగులుతోంది. ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదలైంది. అయితే రామ్ చరణ్ ఇచ్చిన తాజా ప్రకటనల కారణంగా ఇది మళ్ళీ వార్తల్లోకి వస్తోంది.
నెటిజన్లు ముఖ్యంగా ఇతర హీరోల అభిమానులు ఈ ఫేక్ కలెక్షన్ల వల్ల మెగా తండ్రీ కొడుకులను ట్రోల్ చేస్తున్నారు మరియు గాడ్‌ఫాదర్‌ను భారీ హిట్ అని గొప్పగా చెప్పుకుంటున్న వీరిద్దరినీ గేలి చేస్తున్నారు. నిజానికి గాడ్ ఫాదర్ సినిమా బాక్సాఫీస్ వద్ద చాలా నామమాత్రపు ప్రభావం మాత్రమే చూపించింది అని చెప్పవచ్చు.
సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు బాక్సాఫీస్ పరంగా స్పష్టమైన తీర్పు వస్తుంది. స్టార్ హీరోలందరి అభిమానులు నెంబర్లకు సంబంధించి పక్కా వివరాలు మరియు న్సంవర్లని మెయింటైన్ చేస్తారు. ఒక వర్గం అభిమానులు అనైతికంగా సంఖ్యను పెంచితే, మరికొందరు ఖచ్చితమైన ఆధారాలతో కౌంటర్ చేస్తారు.
ఎలాగైనా గాడ్‌ఫాదర్ సినిమాని ఒక సక్సెస్‌ఫుల్ సినిమాగా నిరూపించుకోవాలని మెగా ఫ్యామిలీ ఉవ్విళ్లూరుతోంది. నిజానికి ఈ చిత్రాన్ని ప్రొడక్షన్ హౌస్ సొంతంగా విడుదల చేయగా.. బ్రేక్ ఈవెన్ నంబర్ దాదాపుగా 92 కోట్లుగా నిర్ధారించారు. అయితే ఈ సినిమా దాదాపు 60 కోట్ల వరకు మాత్రమే వసూలు చేయగకిగింది.
బాక్సాఫీస్ వారీగా ఇది పెద్ద డిజాస్టర్ ఫిగర్ అనే చెప్పాలి. అయితే సినిమా సూపర్ హిట్ అంటూ ఈవెంట్స్, పోస్టర్స్, సోషల్ మీడియా పోస్టుల ద్వారా బాగా ప్రొజెక్ట్ చేయాలని గాడ్ ఫాదర్ టీమ్ అనుకుంటున్నారు. సహజంగానే, నెటిజన్లు ఈ నకిలీ నంబర్లని ఖండిస్తున్నారు.
రంగస్థలం సినిమా విడుదలైన సమయంలో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ప్రొడక్షన్ హౌస్ చిత్రాల కలెక్షన్ నంబర్లను వెల్లడించనని హామీ ఇచ్చారు. కానీ చిత్రంగా గాడ్‌ఫాదర్ విషయంలో మాత్రం ఆయన ప్రొడక్షన్ హౌస్ ఫేక్ ఫిగర్లను ప్రకటించింది.
ఈ ద్వంద్వ వైఖరిని నెటిజన్లు బట్టబయలు చేస్తున్నారు. అయితే, ఈ గణాంకాలు కేవలం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి మాత్రమే ఉద్దేశించినవని మరియు అవి చాలావరకు నకిలీవని మనం అర్థం చేసుకోవాలి. ఎవరికీ ఉపయోగపడని ఈ కలెక్షన్లు ప్రకటించే ధోరణి తొందరలోనే ఆగిపోవాలని కోరుకుందాం.