మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం మల్లిడి వశిష్టతెరకెకిస్తున్న సోషియో ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమా విశ్వంభర. ఈ సినిమాపై అందరిలో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ గాని పోస్టర్స్ గాని మంచి ఆదరణ అందుకున్నాయి.
అయితే గ్లింప్స్ లో విజువల్ ఎఫెక్ట్స్ పై విమర్శలు ఎదురవడంతో క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా విజువల్ ఎఫెక్ట్స్ కి మరింత సమయం కేటాయించనుంది విశ్వంభర మూవీ టీం. వాస్తవానికి ఈపాటికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా మరికొన్ని నెలలు అనంతరం ఆడియన్స్ ముందుకు రానుంది. ఇక మరోవైపు అతి త్వరలో అనిల్ రావిపూడి తో ఒక ఫ్యామిలీ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా చేయనున్నారు చిరంజీవి. ఈ సినిమాకి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ ని అనుకుంటుందట టీం.
సాహు గారపాటి నిర్మాతగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మితమవనున్న ఈ సినిమాలో అందాల కథానాయక అదితి రావు హైదరి హీరోయిన్ గా నటించనుండగా భూమికా చావ్లా ఒక కీలకపాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. భీమ్స్ సిసిలోరియో సంగీతం అందించనున్న ఈ సినిమాలో రమణ గోగుల ఒక పాట పాడనున్నారట.
అయితే విషయం ఏమిటంటే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పాత్ర గతంలో ఆయన కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో రిలీజ్ అయిన ఘరానామొగుడు, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు పాత్రలను గుర్తు చేస్తుందని ఆ విధంగా ఆయన మార్క్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో పాటు యాక్షన్ కూడా కలగలిపి అద్భుతంగా అనిల్ రావిపూడి మెగాస్టార్ పాత్రను సిద్ధం చేశారని టాక్. కాగా అందుతున్న సమాచారం జూన్ లో పట్టాలెక్కనున్న ఈ సినిమా పక్కాగా 2026 సంక్రాంతి కానుక ఆడియన్స్ ముందుకు రానుంది. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా గ్రాండ్ గా చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.