మెగా బ్రదర్స్ పవన్ కళ్యాణ్, చిరంజీవి లు ఇద్దరూ ప్రస్తుతం కేవలం లో బడ్జెట్ సినిమాని మాత్రమే చేసే ఉద్దేశంలో ఉన్నారు. భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించేందుకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ యొక్క పనులకు కేటాయించే సమయం ఎక్కువగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఈ తరహా సినిమాలు చేస్తున్నారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డితో భారీ బడ్జెట్ తో చేయగా ఆ సినిమా ఆయన ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అలాగే కొరటాల శివతో ఆయన చేసిన మరో సినిమా ఆచార్య కూడా డిజాస్టర్ అవ్వడంతో ఇక మీదట భారీ వ్యయంతో ఏ సినిమా కూడా చేయడానికి ఆయన సిద్ధంగా లేరు.
చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ తీసుకుంటున్న నిర్ణయాలకు వారి వారి స్వంత కారణాలు ఉండి ఉండవచ్చు. కానీ ఇది ఖచ్చితంగా వారిద్దరి స్టార్ డమ్ ను ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు, ఇది వారి తదుపరి ప్రాజెక్టుల వ్యాపారం పై మరింత ప్రభావం చూపుతుంది.
తన తర్వాతి సినిమాల కోసం ప్రస్తుతం కొందరు చిన్న దర్శకులతో సంప్రదింపులు జరుపుతున్న చిరంజీవి చాలా తక్కువ బడ్జెట్ తో సినిమాలను ఫినిష్ చేయాలనుకుంటున్నారు. తన తదుపరి చిత్రాన్ని తన కూతురు బ్యానర్ లో చేస్తారని.. విడుదలకు ముందే ఆ సినిమాను భారీ లాభాల బాట పట్టించాలని చిరంజీవి భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది.
మెగాస్టార్ స్టార్ డమ్ ఇప్పటికీ చెక్కు చెదరలేదని, మంచి కమర్షియల్ చిత్రాలతో భారీ వసూళ్లు సాధించగలడని నిరూపించిన చిరంజీవి గత చిత్రం వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇక పవన్ కళ్యాణ్ చివరగా నటించిన భీమ్లా నాయక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ వసూళ్లను రాబట్టింది. కాగా పవన్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా సముద్రఖని దర్శకత్వంలో తమిళ చిత్రం వినోదయ సీతం రీమేక్ లో దేవుడి పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ తన తదుపరి విడుదలగా ఆ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.