మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ మూవీ విశ్వంభర. ఈ మూవీ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ గా రూపొందుతుండగా ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీని భారీ స్థాయిలో అత్యధిక వ్యయంతో యువి క్రియేషన్ సంస్థ నిర్మిస్తుండగా ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మరోవైపు బాలకృష్ణ తో డాకు మహారాజ్ మూవీని బాబీ తెరకెక్కిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. మరోవైపు తాజాగా బోయపాటి శ్రీను తో అఖండ 2 మూవీ మొదలెట్టారు బాలకృష్ణ. ఈ మూవీని 2025 సెప్టెంబర్ 25 న రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో మేకర్స్ ప్రకటించారు. విషయం ఏమిటంటే, వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదల కావాల్సిన విశ్వంభర మూవీ విఎఫ్ఎక్స్ వర్క్ లేట్ కారణంగా సెప్టెంబర్ కి వాయిదా పడే ఛాన్స్ ఉందని అంటున్నారు.
అదే కనుక జరిగితే ఒకటి లేదా రెండు వారల గ్యాప్ లో బాలయ్య, చిరంజీవి మూవీస్ రెండూ ఆడియన్స్ ముందుకి రానున్నాయి. ఇటీవల వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల ద్వారా బాక్సాఫీస్ వద్ద క్లాష్ కి వచ్చిన ఈ ఇద్దరు సీనియర్ స్టార్స్, తాజాగా డాకు మహారాజ్, విశ్వంభర ద్వారా మరొక్కసారి క్లాష్ కి వస్తారా లేదా అనేది పక్కాగా తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.